Rohit Sharma : మాట ఇచ్చావ్.. నిలబెట్టుకోవాలి మరీ.! మూడో వన్డే నేపథ్యంలో అభిమానులకు రోహిత్ ఆన
Rohit Sharma : మాట ఇచ్చావ్.. నిలబెట్టుకోవాలి మరీ.! మూడో వన్డే నేపథ్యంలో అభిమానులకు రోహిత్ ఆన
Rohit Sharma : ఇక ఈ ఏడాది భారత్ ఎక్కువ సంఖ్యలో వన్డే సిరీస్ లను ఆడనుంది. అన్ని కూడా స్వదేశంలోనే జరిగే అవకాశం ఉంది. ఇక న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో నెగ్గిన భారత్ సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది.
సొంత గడ్డపై ఈ ఏడాది అక్టోబర్ నెలలో ఆరంభమయ్యే వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023)కోసం టీమిండియా (Team India) సన్నద్దమవుతోంది. ఇందు కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలను రచిస్తోంది.
2/ 8
ఇక ఈ ఏడాది భారత్ ఎక్కువ సంఖ్యలో వన్డే సిరీస్ లను ఆడనుంది. అన్ని కూడా స్వదేశంలోనే జరిగే అవకాశం ఉంది. ఇక న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డేలో నెగ్గిన భారత్ సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది.
3/ 8
ఇక ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ అర్ధ శతకంతో అలరించాడు. ఫోర్లు, సిక్సర్లతో కివీస్ బౌలింగ్ ను ధీటుగా ఎదుర్కొన్నాడు. గత కొంత కాలంగా భారీ ఇన్నింగ్స్ లను ఆడటంలో రోహిత్ విఫలం అవుతున్నాడు.
4/ 8
రెండో వన్డే అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో రోహిత్ శర్మ ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. తాను కొద్ది రోజులుగా భారీ ఇన్నింగ్స్ లు ఆడటం లేదని పేర్కొన్నాడు. ప్రస్తుతం తాను తొలి బంతి నుంచే బౌలర్లపై ఎదురుదాడికి దిగుతున్నాని రోహిత్ పేర్కొన్నాడు.
5/ 8
ఇక భారీ ఇన్నింగ్స్ లు ఆడటంలో విఫలం అవుతున్నందుకు బాధ పడటం లేదని కూడా రోహిత్ తెలిపాడు. ఈ క్రమంలో అభిమానులకు మాట కూడా ఇచ్చాడు. అదేంటంటే త్వరలోనే సెంచరీ కొడతానని పేర్కొన్నాడు.
6/ 8
భారత బౌలింగ్ పై రోహిత్ ప్రశంసల వర్షం కురిపించాడు. గత 5 మ్యాచ్ లుగా భారత్ బౌలింగ్ లో అద్భుతంగా రాణిస్తోందని పేర్కొన్నాడు. షమీ, సిరాజ్ లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారని కూడా పేర్కొన్నాడు.
7/ 8
అయితే ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కు ముందు కొన్ని జాగ్రత్తలు పాటించడం అవసరం అని పేర్కొన్నాడు. ముఖ్యంగా బౌలింగ్ విషయంలో ఈ జాగ్రత్తలు పాటించాల్సి ఉందన్నాడు.
8/ 8
రోహిత్ మాటలను బట్టి చూస్తే.. మూడో వన్డేలో టీమిండియా పలు మార్పులు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే సిరీస్ ను నెగ్గడంతో సిరాజ్, షమీలకు విశ్రాంతి ఇచ్చి ఉమ్రాన్ మాలిక్ కు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది.