ఇక కివీస్ తో జరిగిన వన్డే సిరీస్ లో భారత బౌలింగ్ తేలిపోయింది. తొలి వన్డేలో 306 పరుగులు చేసి కూడా ఓడిపోయింది. ఇక మూడో వన్డేలో వర్షం రాకపోయి ఉంటే భారత్ కు మరో భారీ ఓటమి ఎదురయ్యేది. ఇకనైనా సిరాజ్ ను రెగ్యులర్ గా ఆడిస్తూ వన్డే ప్రపంచకప్ కోసం రెడీ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. సిరాజ్ తన చివరి ఐదు అంతర్జాతీయ మ్యాచ్ ల్లో ఏకంగా 11 వికెట్లు తీశాడు.