IND vs NZ : పాకిస్తాన్ లో వచ్చిన ఊపు ఇండియాలో ఆవిరైపోయిందిగా.. టీమిండియా మాస్టర్ స్ట్రోక్ కు కివీస్ మైండ్ బ్లాక్
IND vs NZ : పాకిస్తాన్ లో వచ్చిన ఊపు ఇండియాలో ఆవిరైపోయిందిగా.. టీమిండియా మాస్టర్ స్ట్రోక్ కు కివీస్ మైండ్ బ్లాక్
IND vs NZ : పాక్ తో జరిగిన వన్డే సిరీస్ ను కివీస్ 2-1తో సొంతం చేసుకుంది. దాంతో వన్డే ర్యాంకింగ్స్ లో కివీస్ తన టాప్ ర్యాంక్ ను పదిలం చేసుకుంది. ఈ క్రమంలోనే భారత్ తో వన్డే, టి20 సిరీస్ లను ఆడేందుకు ఇండియాలో అడుగుపెట్టింది.
టీమిండియా (Team India)లో పర్యటన కంటే కూడా ముందే న్యూజిలాండ్ (New Zealand) జట్టు పాకిస్తాన్ (Pakistan)లో పర్యటించింది. అక్కడ టెస్టు, వన్డే సిరీస్ లను సొంతం చేసుకుంది. పాకిస్తాన్ ను వారి దేశంలో ఓడించడంతో న్యూజిలాండ్ పై అంచనాలు విపరీతంగా పెరిగాయి.
2/ 7
పాక్ తో జరిగిన వన్డే సిరీస్ ను కివీస్ 2-1తో సొంతం చేసుకుంది. దాంతో వన్డే ర్యాంకింగ్స్ లో కివీస్ తన టాప్ ర్యాంక్ ను పదిలం చేసుకుంది. ఈ క్రమంలోనే భారత్ తో వన్డే, టి20 సిరీస్ లను ఆడేందుకు ఇండియాలో అడుగుపెట్టింది.
3/ 7
హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డేలో గట్టి పోటీ ఇచ్చిన కివీస్.. ఆ మ్యాచ్ లో త్రుటిలో ఓడింది. ఇక రాయ్ పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో పూర్తి ఆధిపత్యం కనబరిచిన భారత్ కివీస్ ను చావు దెబ్బ తీసింది.
4/ 7
రెండో వన్డేలోనూ నెగ్గిన భారత్.. సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. ఈ క్రమంలో కివీస్ వన్డే ర్యాంక్ తారుమారు అయ్యింది. రెండో వన్డే ముందు వరకు టాప్ లో కొనసాగిన ఆ జట్టు రెండో స్థానానికి పడిపోయింది.
5/ 7
ఇక భారత్ పుణ్యమా అని రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ తొలి స్థానానికి చేరుకుంది. ఇక అదే సమయంలో నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి భారత్ ఎగబాకింది.
6/ 7
ప్రస్తుతం ఇంగ్లండ్, న్యూజిలాండ్, భారత్ జట్లు 113 రేటింగ్ పాయింట్లతో సమానంగా ఉన్నాయి. అయితే దశాంశ స్థానాల్లో వ్యత్యాసం వలన ఇంగ్లండ్ టాపర్ గా నిలిచింది.
7/ 7
ఇక పాకిస్తాన్ ను ఓడించడంతో వచ్చిన ఊపును ఇండియా ఆవిరి చేసింది. భారత్ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ కు కివీస్ మైండ్ బ్లాక్ అయ్యింది. ఇక ఇరు జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే ఈ నెల 24న జరగనుంది. ఈ మ్యాచ్ కూడా మధ్యాహ్నం గం. 1.30లకు ఆరంభం కానుంది.