టి20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత వన్డేల్లో ఆడుతున్న సిరాజ్ మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లోనూ వికెట్లు తీస్తూ వికెట్ టేకింగ్ బౌలర్ గా మారిపోయాడు. అంతేకాదు తన వన్డే ర్యాంక్ ను కూడా మెరుగుపర్చుకున్నాడు. గత ఆగస్టులో ఎక్కడో 90వ ర్యాంక్ లో ఉన్న అతడు.. ఇప్పుడు 3వ ర్యాంక్ కు చేరుకున్నాడు. ఇలానే సిరాజ్ తన ఫామ్ ను కొనసాగిస్తే వన్డే ప్రపంచకప్ లో భారత్ కు ప్రధాన బౌలర్ గా వ్యవహరించే అవకాశం ఉంది.