IND vs NZ : కివీస్ తో మూడో వన్డే.. సచిన్ మరో రికార్డుపై కన్నేసిన కోహ్లీ.. సాధిస్తాడా మరీ?
IND vs NZ : కివీస్ తో మూడో వన్డే.. సచిన్ మరో రికార్డుపై కన్నేసిన కోహ్లీ.. సాధిస్తాడా మరీ?
IND vs NZ : శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల్లో రెండు సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ సూపర్ టచ్ లో కనిపించాడు. అయితే న్యూజిలాండ్ తో జరిగిన తొలి రెండు వన్డేల్లోనూ పెద్దగా రాణించలేదు.
న్యూజిలాండ్ (New Zeland)తో జరుగుతున్న మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా (Team India) సొంతం చేసుకుంది. ఇక నామమాత్రమైన మూడో వన్డే మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో మంగళవారం జరగనుంది.
2/ 8
శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల్లో రెండు సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ సూపర్ టచ్ లో కనిపించాడు. అయితే న్యూజిలాండ్ తో జరిగిన తొలి రెండు వన్డేల్లోనూ పెద్దగా రాణించలేదు.
3/ 8
తొలి రెండు వన్డేల్లో మాత్రం కోహ్లీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. తొలి వన్డేలో 8 పరుగులు చేసిన అతడు.. రెండో వన్డేలో కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. ఈ రెండు సార్లు లెఫ్టార్మ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నెర్ కు అవుటయ్యాడు.
4/ 8
అయితే మూడో వన్డేలో భారీ స్కోరు సాధించాలనే పట్టుదల మీద కోహ్లీ ఉన్నాడు. ఈ క్రమంలో కోహ్లీ సచిన్ కు సంబంధించిన మరో రికార్డుపై కన్నేశాడు. మూడో వన్డేలో కోహ్లీ అర్ధ సెంచరీ సాధిస్తే సచిన్ రికార్డును బద్దలు కొడతాడు.
5/ 8
న్యూజిలాండ్ పై అటు సచిన్ ఇటు కోహ్లీ ఇరువురు కూడా 13 అర్ధ సెంచరీలు సాధించి సమానంగా ఉన్నారు. మంగళవారం జరిగే మూడో వన్డేలో కోహ్లీ అర్ధ సెంచరీ సాధిస్తే సచిన్ 13 అర్ధ సెంచరీల రికార్డును దాటేస్తాడు.
6/ 8
ఒకవేళ మూడో వన్డేలో కోహ్లీ సెంచరీ సాధించినా సచిన్ ను దాటేస్తాడు. వన్డేల్లో కివీస్ పై సచిన్, కోహ్లీలు చెరో ఆరు సెంచరీలు బాదారు. ఒకవేళ కోహ్లీ మూడో వన్డేలో శతకం బాదితే ఏడు సెంచరీలతో సచిన్ ను అధిగమిస్తాడు.
7/ 8
వన్డేల్లో కివీస్ పై అత్యధిక శతకాలు బాదిన టీమిండియా ప్లేయర్ గా వీరేంద్ర సెహ్వాగ్ (7 సెంచరీలు) ఉన్నాడు. మూడో వన్డేలో కోహ్లీ సెంచరీ చేస్తే సెహ్వాగ్ సరసన నిలుస్తాడు.
8/ 8
మంగళవారం జరిగే ఈ మ్యాచ్ మధ్యాహ్నంగ 1.30 గంటలకు ఆరంభం కానుంది. ఇండోర్ గ్రౌండ్ బ్యాటింగ్ వికెట్ ఈ క్రమంలో మూడో వన్డేలో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.