SuryaKumar Yadav : రికార్డుల సునామీ సృష్టించినా.. ఆ విషయంలో కోహ్లీని మాత్రం టచ్ చేయలేకపోయిన సూర్య
SuryaKumar Yadav : రికార్డుల సునామీ సృష్టించినా.. ఆ విషయంలో కోహ్లీని మాత్రం టచ్ చేయలేకపోయిన సూర్య
SuryaKumar Yadav : ఈ ఏడాది అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. 31 మ్యాచ్ ల్లో 1,164 పరుగులు చేశాడు. ఇందులో రెండు భారీ శతకాలు ఉండటం విశేషం.
సూర్యకుమర్ యాదవ్ (SuryaKumar Yadav)కు 2022వ సంవత్సరం ఒక తీపి గుర్తుగా మిగిలి పోనుంది. ఈ ఏడాది సూర్యకుమార్ ఆడిన విధంగా ఏ బ్యాటర్ కూడా ఆడలేదు. ముఖ్యంగా టి20 ఫార్మాట్ కు సూర్యకుమార్ యాదవ్ కొత్త అర్థం చెప్పాడు.
2/ 8
ఈ ఏడాది అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. 31 మ్యాచ్ ల్లో 1,164 పరుగులు చేశాడు. ఇందులో రెండు భారీ శతకాలు ఉండటం విశేషం.
3/ 8
బౌలర్ ఎవరైనా.. పిచ్ ఎలా ఉన్నా బెదరకుండా.. అదరకుండా బౌండరీలు బాదడం సూర్యకుమార్ యాదవ్ కు మాత్రమే సాధ్యమైంది. అందుకే ఇప్పుడు క్రికెట్ లో సూర్యకుమార్ నయా సెన్సేషన్ లా మారిపోయాడు.
4/ 8
తాజాగా ప్రకటించి ఐసీసీ ర్యాంకింగ్స్ లో సూర్యకుమార్ యాదవ్ తన నంబర్ వన్ ర్యాంక్ ను నిలబెట్టుకున్నాడు. 890 రేటింగ్ పాయింట్లతో మరోసారి అగ్రస్థానంలో నిలిచాడు.
5/ 8
నంబర్ వన్ ర్యాంక్ కోసం సూర్యుకుమార్ యాదవ్ తో తీవ్రంగా పోటీ పడ్డ పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్ 836 రేటింగ్స్ తో రెండో స్థానంలో నిలిచాడు.
6/ 8
ఇక డిసెంబర్ నెలలో భారత్ తో సహా మిగిలిన ప్రధాన జట్లు టి20 సిరీస్ లను ఆడటం లేదు. దాంతో ఈ ఏడాదిని సూర్యకుమార్ యాదవ్ టి20 నంబర్ వన్ బ్యాటర్ ర్యాంక్ తో ముగించనున్నాడు.
7/ 8
ఈ ఏడాది సూర్యకుమార్ యాదవ్ టి20 ఫార్మాట్ లో రికార్డుల సునామీని సృష్టించినా కింగ్ కోహ్లీ పేరిట ఉన్న ఒక రికార్డును మాత్రం అందుకోలేకపోయాడు. 2016లో విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టి20ల్లో టాప్ ర్యాంక్ లో నిలిచాడు. ఆ సమయంలో కోహ్లీ 897 రేటింగ్ పాయింట్లను సాధించాడు.
8/ 8
ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ టి20ల్లో టాప్ ర్యాంక్ ను సాధించినా.. రేటింగ్స్ లో మాత్రం కోహ్లీని టచ్ చేయలేకపోయాడు. మ్యాచ్ మ్యాచ్ కు రేటింగ్ పాయింట్స్ మారుతుంటాయి. ఈ ఏడాది సూర్య రెచ్చిపోయి ఆడినా.. అది కోహ్లీ 2016 ఫామ్ ను అందుకోలేదనే చెప్పాలి.