అయితే ఇకపై రెస్ట్ అనే పదానికి చరమగీతం పాడాలని సునీల్ గావస్కర్ సూచించాడు. 'ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా చూసుకోవడం ముఖ్యమే. కానీ వన్డే ప్రపంచకప్‌కు మరో ఏడాది సమయం మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్లకు విశ్రాంతినివ్వద్దు. వీలైనంత వరకు ఆటగాళ్లంతా కలిసి ఆడేలా చూడాలి. అప్పుడే అందరి మధ్య చక్కటి సమన్వయం ఏర్పడుతుంది. టీంగా ఆడతారు’ అని గావస్కర్ పేర్కొన్నాడు.