IND vs NZ : ఉజ్జయిని మహాకాళేశ్వర్ గుడిలో టీమిండియా క్రికెటర్ల ప్రత్యేక పూజలు.. అయితే తమ కోసం కాదు.. ఎవరి కోసమంటే?
IND vs NZ : ఉజ్జయిని మహాకాళేశ్వర్ గుడిలో టీమిండియా క్రికెటర్ల ప్రత్యేక పూజలు.. అయితే తమ కోసం కాదు.. ఎవరి కోసమంటే?
IND vs NZ : ఈ క్రమంలో ఇరు జట్ల ప్లేయర్లు కూడా ఇండోర్ కు చేరుకున్నారు. ఈ మ్యాచ్ మంగళవారం మధ్యాహ్నం గం. 1.30లకు ఆరంభం కానుంది. టాస్ గెలిచిన జట్టు మరోసారి బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
న్యూజిలాండ్ (New Zeland)తో జరుగుతున్న మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా (Team India) సొంతం చేసుకుంది. ఇక నామమాత్రమైన మూడో వన్డే మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో మంగళవారం జరగనుంది.
2/ 8
ఈ క్రమంలో ఇరు జట్ల ప్లేయర్లు కూడా ఇండోర్ కు చేరుకున్నారు. ఈ మ్యాచ్ మంగళవారం మధ్యాహ్నం గం. 1.30లకు ఆరంభం కానుంది. టాస్ గెలిచిన జట్టు మరోసారి బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
3/ 8
ఇక సోమవారం ఉదయం భారత క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ లు ఉజ్జయిని మహాకాళేశ్వర్ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివుడికి అభిషేకం చేసి.. బాబా మహా కాల్ భస్మ హారతిని ఇచ్చారు. (PC : ANI)
4/ 8
వీటికి సంబంధించిన ఫోటోలను ANI తన ట్విట్టర్ ఖాతాలో పెట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోస్ వైరల్ గా మారాయి. ఇక పూజలు అనంతరం సూర్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడాడు. ఈ క్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. (PC : ANI)
5/ 8
ఇటీవలె కారు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డ రిషభ్ పంత్ త్వరగా కోలుకోవాలని శివుడిని ప్రార్ధించినట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే ప్రత్యేక పూజలు కూడా చేసినట్లు పేర్కొన్నాడు. (PC : ANI)
6/ 8
గతేడాది డిసెంబర్ 30న రిషభ్ పంత్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో కారు పూర్తిగా కాలిపోయింది. పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
7/ 8
ఈ ప్రమాదంలో అతడి కుడి కాలు తీవ్రంగా గాయపడింది. ఇప్పటికే రెండు శస్త్ర చికిత్సలను వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. త్వరలోనే మరో శస్త్ర చికిత్సను నిర్వహించనున్నారు.
8/ 8
పంత్ ఆరోగ్యం గురించి బీసీసీఐ ఎప్పటికప్పుడు వివరాలను డాక్టర్లతో అడిగి తెలుసుకుంటుంది. పంత్ గాయాల నుంచి కోలుకోవడానికి కనీసం 6 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ఏడాది పంత్ దాదాపుగా క్రికెట్ కు దూరంగా ఉండే అవకాశం ఉంది.