IND vs NZ 3rd ODI : కివీస్ తో చావోరేవో మ్యచ్ కు సిద్ధమైన టీమిండియా.. వాతావరణం ఎలా ఉందంటే?
IND vs NZ 3rd ODI : కివీస్ తో చావోరేవో మ్యచ్ కు సిద్ధమైన టీమిండియా.. వాతావరణం ఎలా ఉందంటే?
IND vs NZ 3rd ODI : ఈ సిరీస్ ను న్యూజిలాండ్ కోల్పోయే అవకాశం అయితే లేదు. ఇక సిరీస్ ను సమం చేయాలంటే భారత్ తప్పనిసరిగా మూడో వన్డేలో నెగ్గాల్సి ఉంది. వర్షంతో రద్దయినా.. లేదా ఓడినా సిరీస్ కివీస్ వశం అవుతుంది.
మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా క్రైస్ట్ చర్చ్ వేదికగా భారత్ (India), న్యూజిలాండ్ (New Zealand) జట్ల మధ్య మూడో వన్డే బుధవారం జరగనుంది. తొలి వన్డేలో కివీస్ జట్టు నెగ్గగా.. రెండో వన్డే వర్షంతో రద్దయ్యింది.
2/ 8
ఈ సిరీస్ ను న్యూజిలాండ్ కోల్పోయే అవకాశం అయితే లేదు. ఇక సిరీస్ ను సమం చేయాలంటే భారత్ తప్పనిసరిగా మూడో వన్డేలో నెగ్గాల్సి ఉంది. వర్షంతో రద్దయినా.. లేదా ఓడినా సిరీస్ కివీస్ వశం అవుతుంది.
3/ 8
భారత్, న్యూజిలాండ్ సిరీస్ కు వరుణుడు అడ్డుపడుతూనే ఉన్నాడు. వర్షం చినుకు లేకుండా ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. ఇప్పటి వరకు ఆడిన ప్రతి మ్యాచ్ కు కూడా వాన అడ్డుపడుతూనే ఉంది.
4/ 8
టి20 సిరీస్ లో తొలి టి20 రద్దు కాగా.. మూడో టి20 వర్షంతో పూర్తిగా సాగలేదు. ఇక రెండో వన్డే వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది. దాంతో ఈ పర్యటనలో చివరిదైన మూడో వన్డే అయినా సజావుగా సాగాలని అభిమానులు కోరుకుంటున్నారు.
5/ 8
క్రైస్ట్ చర్చ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కు కూడా వాన గండం పొంచి ఉంది. ఈ డే అండ్ నైట్ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ సమయంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది.
6/ 8
తొలి ఇన్నింగ్స్ సమయంలో వర్ష సూచన లేకపోయినా.. సరిగ్గా సాయంత్రం నుంచి ఈదురు గాలులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. డక్ వర్త్ లూయిస్ పద్దతిన మ్యాచ్ ఫలితం తేలాలంటే రెండో ఇన్నింగ్స్ లో కనీసం 20 ఓవర్ల ఆట పూర్తయ్యి ఉండాలి.
7/ 8
ఇక వర్షంతో మూడో వన్డే జరగకపోతే సిరీస్ కివీస్ వశం అవుతుంది. రెండో ఇన్నింగ్స్ లో వర్షం పడే అవకాశం ఉండటంతో టాస్ కీలకంగా మారనుంది. టాస్ నెగ్గిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
8/ 8
భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ బుధవారం ఉదయం 7 గంటలకు ఆరంభం కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు డీడీ స్పోర్ట్స్ ఈ మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నయి.