IND vs NZ : ‘చెత్త నిర్ణయాలతో జట్టును భ్రష్టు పట్టిస్తారా?’ టీమిండియాపై లెజండరీ బౌలర్ ఘాటు వ్యాఖ్యలు
IND vs NZ : ‘చెత్త నిర్ణయాలతో జట్టును భ్రష్టు పట్టిస్తారా?’ టీమిండియాపై లెజండరీ బౌలర్ ఘాటు వ్యాఖ్యలు
IND vs NZ : తొలి వన్డేలో భారత్ ఓడటం.. రెండో వన్డే వర్షంతో రద్దు కావడంతో సిరీస్ భారత్ వశం అయ్యే అవకాశం లేదు. సిరీస్ ను సమం చేయాలంటే ఈ నెల 30న జరిగే మూడో వన్డేలో భారత్ తప్పకుండా నెగ్గాల్సి ఉంది.
ప్రస్తుతం టీమిండియా (Team India) న్యూజిలాండ్ (New Zealand) పర్యటనలో ఉంది. హార్దిక్ పాండ్యా (Hardik Pandya) నాయకత్వంలోని టీమిండియా టి20 సిరీస్ ను సొంతం చేసుకుంది. వన్డే సిరీస్ లో మాత్రం భారత్ వెనుకబడి ఉంది.
2/ 8
తొలి వన్డేలో భారత్ ఓడటం.. రెండో వన్డే వర్షంతో రద్దు కావడంతో సిరీస్ భారత్ వశం అయ్యే అవకాశం లేదు. సిరీస్ ను సమం చేయాలంటే ఈ నెల 30న జరిగే మూడో వన్డేలో భారత్ తప్పకుండా నెగ్గాల్సి ఉంది.
3/ 8
ఇక ఆదివారం జరిగిన రెండో వన్డే కోసం భారత జట్టు ప్రకటించిన ప్లేయింగ్ ఎలెవెన్ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఫామ్ లో ఉన్న సంజూ సామ్సన్ ను పక్కనపెట్టడం ఏంటంటూ క్రికెట్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
4/ 8
6వ బౌలర్ ఆప్షన్ కావాలనుకుంటే పంత్ ను తప్పించి దీపక్ హుడాను తీసుకోవాల్సిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక భారత మాజీ పేసర్, గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా కూడా రెండో వన్డే కోసం ప్రకటించిన భారత జట్టుపై పెదవి విరిచాడు.
5/ 8
అనాలోచిత నిర్ణయాలతో జట్టును భ్రష్టు పట్టిస్తున్నారంటూ టీమిండియాపై మండిపడ్డాడు. అమెజాన్ ప్రైమ్ వీడియో లైవ్ లో మాట్లాడిన అతడు శార్దుల్ ఠాకూర్ ను తప్పించడంపై మండిపడ్డాడు.
6/ 8
ఒక్క మ్యాచ్ లో విఫలం అయినంత మాత్రానే శార్దుల్ ను ఎలా పక్కన బెడతారంటూ టీమిండియా మేనేజ్ మెంట్ ను ప్రశ్నించాడు. వాషింగ్టన్ సుందర్, చహల్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నా దీపక్ హుడాను బౌలింగ్ ఆప్షన్ గా తీసుకోవడం సరైన నిర్ణయం కాదన్నాడు.
7/ 8
తాను దీపక్ హుడాను బ్యాటర్ గా మాత్రమే చూస్తానని కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇక సంజూ సామ్సన్ ను తప్పించడంపై కూడా ఆశిష్ నెహ్రా కీలక వ్యాఖ్యలు చేశాడు.
8/ 8
తాను రెండో వన్డే కోసం భారత జట్టును ఎంపిక చేసి ఉంటే.. సంజూ సామ్సన్ స్థానంలో దీపక్ హుడాను తీసుకునే వాడినంటూ ఆశ్యర్యకర వ్యాఖ్యలు చేశాడు.