Rohit Sharma : అందరూ కొడతారు.. రోహిత్ మాత్రం చెప్పి కొడతాడు.. అందుకే హిట్ మ్యాన్ అయ్యాడు
Rohit Sharma : అందరూ కొడతారు.. రోహిత్ మాత్రం చెప్పి కొడతాడు.. అందుకే హిట్ మ్యాన్ అయ్యాడు
Rohit Sharma : మంచి ఆరంభాలు లభించినా బిగ్ ఇన్నింగ్స్ లను ఆడటంలో విఫలం అవుతున్నాడనే అపవాదును రోహిత్ శర్మ గత కొంత కాలంగా ఎదుర్కొంటున్నాడు. దానితో పాటు నిలకడలేని ఆటతో ఇబ్బంది పడ్డాడు.
ఫామ్ లో లేడు అని చెప్పలేం. అలా అని అదరగొడుతున్నాడా అంటే అదీ లేదు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో గత మూడేళ్లుగా రోహిత్ శర్మ (Rohit Sharma) బ్యాటింగ్ తీరు ఇది. ఓపెనర్ గా వచ్చి ఫటా ఫట్ షాట్లతో వేగంగా పరుగులు సాధించడం.. ఆపై వెంటనే అవుటవ్వడం.. గత కొంత కాలంగా రోహిత్ పరిస్థితి ఇది.
2/ 8
మంచి ఆరంభాలు లభించినా బిగ్ ఇన్నింగ్స్ లను ఆడటంలో విఫలం అవుతున్నాడనే అపవాదును రోహిత్ శర్మ గత కొంత కాలంగా ఎదుర్కొంటున్నాడు. దానితో పాటు నిలకడలేని ఆటతో ఇబ్బంది పడ్డాడు.
3/ 8
మరోవైపు 2019 తర్వాత సెంచరీ లేని విరాట్ కోహ్లీ సైతం 2022 ఆసియా కప్ లో శతకం బాదాడు. అప్పటి నుంచి మళ్లీ శతకాల కోహ్లీని అందరికీ చూపిస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే 2 శతకాలు బాది ఔరా అనిపిస్తున్నాడు.
4/ 8
ఈ క్రమంలో రోహిత్ పై ఒత్తిడి పెరిగింది. సెంచరీ ఎప్పుడంటూ అభిమానుల నుంచి ప్రశ్నలను సైతం ఎదుర్కొన్నాడు. అయితే న్యూజిలాండ్ తో జరిగిన రెండో వన్డే అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో సెంచరీపై రోహిత్ ఆసక్తికర కామెంట్ చేశాడు.
5/ 8
సెంచరీ గురించి టెన్షన్ వద్దంటూ పేర్కొన్న రోహిత్.. త్వరలోనే శతకాన్ని బాదుతా అంటూ అభిమానులకు మాట ఇచ్చాడు. సరిగ్గా రెండు రోజుల తర్వాత రోహిత్ ఆ మాటను నిలబెట్టుకున్నాడు.
6/ 8
ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో రోహిత్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఈ క్రమంలో అందని ద్రాక్షలా ఉన్న సెంచరీని అందుకున్నాడు. 2020 జనవరి 19న ఆస్ట్రేలియాపై చివరిసారిగా వన్డేల్లో శతకం బాదిన రోహిత్ శర్మ.. మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ 50 ఓవర్ల ఫార్మాట్ లో సెంచరీ బాదాడు.
7/ 8
రోహిత్ శర్మ 83 బంతుల్లో 100 పరుగుల మార్కును అందుకున్నాడు. ఇందులో 6 బారీ సిక్సర్లు ఉండగా.. 9 ఫోర్ లు ఉన్నాయి. మరో ఎండ్ లో ఉన్న శుబ్ మన్ గిల్ కూడా సెంచరీ బాదేశాడు. అయితే కాసేపటికే వీరిద్దరూ పెవిలియన్ కు చేరారు.
8/ 8
సెంచరీలు అందరూ కొడతారు.. కానీ, రోహిత్ మాత్రం చెప్పి మరీ కొడతాడంటూ అతడి అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు. ఈ వన్డే తర్వాత భారత్, కివీస్ జట్ల మధ్య మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ జరగనుంది.