ఇండియా - న్యూజీలాండ్ మధ్య ముంబై వాంఖడే స్టేడియంలో రెండో టెస్టు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా మొదలవుతుందని అధికారులు చెప్పారు. అయితే మరికొన్ని నిమిషాల్లో మ్యాచ్ ప్రారంభం అవుతుందనగా.. టీమ్ ఇండియాలోని కీలక ప్లేయర్లు గాయం కారణంగా మ్యాచ్ నుంచి తప్పుకున్నారు. (PC: BCCI)
విరాట్ కోహ్లీ - ద్రవిడ్ తొలి సారిగా కలసి ఆడుతున్నారు. పదేళ్ల క్రితం ద్రవిడ్ చివరి వన్డేలో కోహ్లీ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ కలసి ఎన్నడూ మైదానంలో అడుగు పెట్టలేదు. దీంతో ఈ టెస్టు చాలా ప్రత్యేకంగా నిలిచింది. తుది జట్టుపై మల్లగుల్లాలు పడుతుండగా.. ముగ్గురు గాయాల కారణంగా తప్పుకోవడంతో జట్టులోకి యువకులను తీసుకోనున్నారు. తొలి టెస్టు ఆడని కోహ్లీ, సిరాజ్‌తో పాటు మరెవరు జట్టులో ఉంటారనే ఆసక్తికరంగా మారింది. (PC: BCCI)