భారీగా పరుగులు ఇవ్వడంతో పాటు క్రమశిక్షణ లేని బౌలింగ్ తో అభిమానులకు కోపం తెప్పిస్తున్నాడు. ముఖ్యంగా రనప్ పై నియంత్రణ లేదు. ప్రతి మ్యాచ్ లోనూ నోబాల్స్ వేస్తున్నాడు. టి20 ఫార్మాట్ లో నో బాల్ అనేది నేరం. ఒక్క నో బాల్ వేసిన నేరానికి.. ఫ్రీ హిట్ రూపంలో రెండు బంతులకు శిక్షను అనుభవించాలి. అది బౌలర్ తో పాటు టీంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.
ఈ ఏడాది శ్రీలంకతో జరిగిన రెండో టి20లో ఏకంగా 5 నో బాల్స్ వేశాడు. ఇక తాజాగా కివీస్ తో జరిగిన తొలి టి20లో ఆఖరి ఓవర్ తొలి బంతికి నో బాల్ వేశాడు. ఆ బంతిని డారిల్ మిచెల్ సిక్సర్ బాదాడు. ఫ్రీహిట్ ను కూడా స్టాండ్ బయటకు కొట్టాడు. ఆఖరి ఓవర్లో అర్ష్ దీప్ సింగ్ ఏకంగా 27 పరుగులు ఇచ్చాడు. ఇదే భారత్ ను గెలవకుండా చేసింది.
అర్ష్ దీప్ లో చాలా ప్రతిభ ఉంది. ప్రతిభతో పాటు క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యం. అయితే ప్రస్తుతం అర్ష్ దీప్ సింగ్ క్రమశిక్షణ తప్పాడనే చెప్పాలి. అతడిని మళ్లీ సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత కోచ్ ద్రవిడ్ దే. ఈ క్రమంలో ద్రవిడ్ అర్ష్ దీప్ విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాడో చూడాలి. టీచర్ లా బెత్తం పట్టి పాఠాలు చెబుతాడో.. లేక ఫ్రెండ్ లో చెబుతాడో చూడాలి.