తన యూట్యాబ్ చానెల్ లో మాట్లాడిన ఆకాశ్ చోప్రా ‘ప్రస్తుతం టీమిండియాకు ఒక విధ్వంసకర ఓపెనర్ అవసరం. పృథ్వీ షా రూపంలో టీమిండియాకు ఆన్సర్ కూడా ఉంది. తొలి బంతి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై అటాకింగ్ ఆటతో స్కోరు బోర్డును పరుగెత్తించగలడు. పవర్ ప్లేలో వేగంగా పరుగులు సాధించగలడు’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు.