IND vs NZ : టీమిండియాలో మరో అవేశ్ ఖాన్.. తీరు మార్చుకోకుంటే ఫసక్కే
IND vs NZ : టీమిండియాలో మరో అవేశ్ ఖాన్.. తీరు మార్చుకోకుంటే ఫసక్కే
IND vs NZ : అందుకు కారణం రిటెన్షన్ లో పంజాబ్ కింగ్స్ అర్ష్ దీప్ సింగ్ ను అంటి పెట్టుకోవడమే. ఆ తర్వాత ఐపీఎల్ లో అదరగొట్టిన అతడు అందరి చూపును తన వైపునకు తిప్పుకున్నాడు.
గతేడాది జరిగిన ఐపీఎల్ (IPL) మెగా వేలానికి ముందు రిటెన్షన్ ప్రక్రియలో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ఆడకుండానే.. యువ బౌలర్ అర్ష్ దీప్ సింగ్ (Arshdeep Singh) వార్తల్లోకి ఎక్కాడు.
2/ 8
అందుకు కారణం రిటెన్షన్ లో పంజాబ్ కింగ్స్ అర్ష్ దీప్ సింగ్ ను అంటి పెట్టుకోవడమే. ఆ తర్వాత ఐపీఎల్ లో అదరగొట్టిన అతడు అందరి చూపును తన వైపునకు తిప్పుకున్నాడు.
3/ 8
అనంతరం సౌతాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్ కు ఎంపికైనా ఆడలేదు. ఐర్లాండ్ తో జరిగిన సిరీస్ లో రాణించాడు. జస్ ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ లు ఆసియా కప్ నుంచి తప్పుకోవడంతో ఆసియాకప్ లో చోటు దక్కించుకున్న అర్ష్ దీప్ సింగ్ అద్భుతంగా రాణించాడు.
4/ 8
సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కంటే కూడా మెరుగ్గా బౌలింగ్ చేశాడు. ముఖ్యంగా డెత్ ఓవర్స్ లో. ఇక టి20 ప్రపంచకప్ లో కూడా అర్ష్ దీప్ సింగ్ రాణించాడు. అంతా బాగా ఉందనుకునే సమయంలో అర్ష్ దీప్ సింగ్ ఒక్కసారిగా తన ఫామ్ ను కోల్పోయాడు.
5/ 8
నో బాల్స్ తో భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 5 నోబాల్స్ వేశాడు. రెండు ఓవర్స్ వేసి 37 పరుగులు సమర్పించుకున్నాడు. దెబ్బకు హార్దిక్ పాండ్యా అతడితో మరో ఓవర్ వేయించే సాహసం చేయలేదు.
6/ 8
ఇక తాజాగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి టి20లో కూడా అర్ష్ దీప్ పేలవ ప్రదర్శన చేశాడు. 20వ ఓవర్ లో ఏకంగా 27 పరుగులు సమర్పించుకున్నాడు. ఒకరకంగా ఈ ఓవరే భారత్ ఓటమిని శాసించింది.
7/ 8
అర్ష్ దీప్ ప్రస్తుత ఫామ్ ను చూస్తే అవేశ్ ఖాన్ గుర్తు రాక మానదు. ఐపీఎల్ లో అదరొట్టిన అవేశ్ ఖాన్ టీమిండియాలోకి వచ్చాడు. ఆరంభంలో సత్తా చాటాడు. అయితే ఆ తర్వాత పేలవ ప్రదర్శనతో జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాడు.
8/ 8
ప్రస్తుతం అర్ష్ దీప్ సింగ్ కూడా అవేశ్ ఖాన్ పరిస్థితిలోనే నిలిచాడు. టి20 ప్రపంచకప్ తర్వాత అర్ష్ దీప్ బౌలింగ్ పేలవంగా మారింది. నో బాల్స్ తో ఫ్రీగా ప్రత్యర్థికి పరుగులు సమర్పించుకుంటున్నాడు. బౌలింగ్ లో అతడు మునుపటి లయను అందుకోకపోతే జట్టులో చోటు కోల్పోవడం ఖాయం.