IND vs NZ T20 Series : వన్డేల్లో హీరో.. టి20ల్లో జీరో.. పొట్టి ఫార్మాట్ లో అతడి కథేం బాగోలేదు.. ఎవరంటే?
IND vs NZ T20 Series : వన్డేల్లో హీరో.. టి20ల్లో జీరో.. పొట్టి ఫార్మాట్ లో అతడి కథేం బాగోలేదు.. ఎవరంటే?
IND vs NZ T20 Series : ఇక అందివచ్చిన అవకాశాన్ని టీమిండియా యంగ్ గన్స్ నేలపాలు చేసుకున్నారు. ముఖ్యంగా ఓపెనర్లు ఇషాన్ కిషన్, శుబ్ మన్ గిల్ లు పేలవ ప్రదర్శన చేశారు. వన్ డౌన్ లో వచ్చిన రాహుల్ త్రిపాఠి కూడా నిరాశ పరిచాడు.
రాంచీ వేదికగా న్యూజిలాండ్ (New Zealand)తో జరిగిన తొలి టి20లో టీమిండియా (Team India) టాపార్డర్ బ్యాటింగ్ తీవ్రంగా నిరాశ పరిచింది. సీనియర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli) లేని లోటు స్పష్టంగా కనిపించింది.
2/ 8
ఇక అందివచ్చిన అవకాశాన్ని టీమిండియా యంగ్ గన్స్ నేలపాలు చేసుకున్నారు. ముఖ్యంగా ఓపెనర్లు ఇషాన్ కిషన్, శుబ్ మన్ గిల్ లు పేలవ ప్రదర్శన చేశారు. వన్ డౌన్ లో వచ్చిన రాహుల్ త్రిపాఠి కూడా నిరాశ పరిచాడు.
3/ 8
ముఖ్యంగా శుబ్ మన్ గిల్ పై ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. వన్డేల్లో సూపర్ ఫామ్ లో ఉన్న గిల్.. టి20లకు వచ్చేసరికి పేలవంగా మారిపోతున్నాడు. శ్రీలంకపై సెంచరీతో పాటు కివీస్ పై రెండు సెంచరీలు బాదిన అతడు టి20ల్లో మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్నాడు.
4/ 8
మొన్నటి వరకు టెస్టు ప్లేయర్ గానే ఉన్న శుబ్ మన్ గిల్.. ఈ ఏడాదితో ఆల్ ఫార్మాట్ ప్లేయర్ గా మారిపోయాడు. టెస్టులు, వన్డేల్లో రాణిస్తున్న అతడు పొట్టి పార్మాట్ లో మాత్రం చేతులెత్తేస్తున్నాడు.
5/ 8
ఈ ఏడాది టి20ల్లో అరంగేట్రం చేసిన గిల్ ఇప్పటి వరకు నాలుగు టి20లను ఆడాడు. ఇందులో ఒకే ఒక్కసారి డబుల్ ఫిగర్ ను అందుకున్నాడు. మిగిలిన మూడు పర్యాయాలు సింగిల్ డిజిట్ కే వెనుదిరిగాడు.
6/ 8
శ్రీలంకతో ఈ ఏడాది జరిగిన టి20 సిరీస్ లో వరుసగా 7, 5, 46 పరుగులు చేసిన అతడు.. కివీస్ తో జరిగిన తొలి టి20లో 7 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో గిల్ టి20లకు పనికిరాడేమో అన్న డౌట్ ఫ్యాన్స్ లో మొదలైంది.
7/ 8
అయితే గిల్ ను ఇప్పటికిప్పుడు టి20ల నుంచి వేటు వేస్తారని అనుకోవడానికి వీలు లేదు. అయితే అతడు కివీస్ తో జరిగే మిగిలిన రెండు టి20ల్లోనూ తన బ్యాట్ కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అది జరగ్గపోతే అతడు వన్డే, టెస్టు ప్లేయర్ గానే మిగిలే అవకాశం ఉంది.
8/ 8
ఇక భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టి20 లక్నో వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ఆరంభం కానుంది. ఇందులో కివీస్ గెలిస్త్ సిరీస్ వారి సొంతం అవుతుంది. భారత్ నెగ్గితే సమం అవుతుంది.