30న జరిగే వన్డే వర్షంతో రద్దయినా.. లేక అందులో భారత్ ఓడినా సిరీస్ న్యూజిలాండ్ వశం అవుతుంది. రెండో వన్డేకు వరుణుడు అడ్డు తగులుతూనే వచ్చాడు. మధ్యలో కాసేపు వాన ఆగిపోవడంతో ఇన్నింగ్స్ కు 29 ఓవర్ల చొప్పున ఆటను కుదించారు. అయితే 12.5 ఓవర్ల తర్వాత వాన రావడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాన తగ్గాక అవుట్ ఫీల్డ్ లో ఉన్న కవర్స్ ను గ్రౌండ్ స్టాఫ్ తొలగించే ప్రయత్నం చేశారు. అయితే గాలులు ఎక్కువగా ఉండటంతో కవర్స్ వారిని ఇబ్బంది పెట్టాయి. అక్కడే ఉన్న సామ్సన్ వెంటనే కవర్స్ ను పట్టుకుని అవి గాలికి అటూ ఇటూ ఊగకుండా అడ్డుకున్నాడు.