IND vs NZ : రైనా 13 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన వాషింగ్టన్ సుందర్.. ఎందులో అంటే?
IND vs NZ : రైనా 13 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన వాషింగ్టన్ సుందర్.. ఎందులో అంటే?
IND vs NZ : అయితే అక్లాండ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత్ 306 పరుగులు చేసినా గెలవలేకపోయింది. ఆఖర్లో భారత బౌలర్లు చేతులెత్తేయడంతో టీమిండియా ఓడిపోయింది.
ప్రస్తుతం భారత్ (India) న్యూజిలాండ్ (New Zealand) పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ ను చేజిక్కించుకున్న భారత్.. వన్డే సిరీస్ ను కూడా సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.
2/ 8
అయితే అక్లాండ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత్ 306 పరుగులు చేసినా గెలవలేకపోయింది. ఆఖర్లో భారత బౌలర్లు చేతులెత్తేయడంతో టీమిండియా ఓడిపోయింది.
3/ 8
అయితే ఈ మ్యాచ్ లో భారత్ విషయంలో కొన్ని మంచి విషయాలు జరిగాయి. శిఖర్ ధావన్, శుబ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ లు అర్ధ సెంచరీలతో రాణించిన సంగతి తెలిసిందే. ఇక వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్ లో రెచ్చిపోయి ఆడాడు. బౌలింగ్ లో ఉమ్రాన్ మాలిక్ నిప్పులు చెరిగాడు.
4/ 8
ఈ మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ కేవలం 16 బంతుల్లోనే 37 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 3 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ క్రమంలో సుందర్ సురేశ్ రైనా పేరిట 13 ఏళ్లుగా ఉంటోన్న ఓ రికార్డును బద్దలు కొట్టాడు.
5/ 8
2009లో న్యూజిలాండ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 7వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన సురేశ్ రైనా 18 బంతుల్లో38 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కివీస్ గడ్డపై వేగంగా 30 పరుగులు చేసిన భారత బ్యాటర్ గా నిలిచాడు.
6/ 8
తాజాగా సుందర్ ఈ రికార్డును బద్దలు కొట్టాడు. సుందర్ ఈ మ్యాచ్ లో కేవలం 16 బంతుల్లోనే 37 పరుగులు చేశాడు. ఈ క్రమంలో సుందర్ కేవలం 14 బంతుల్లోనే 30 పరుగల మార్కును దాటాడు.
7/ 8
దాంతో 13 ఏళ్లుగా సురేశ్ రైనా పేరిట ఉన్న ఈ రికార్డును సుందర్ తన పేరు మీదకు మార్చుకున్నాడు. అవకాశాలు ఇస్తే తాను చెలరేగిపోతానని సుందర్ టీమిండియా మేనేజ్ మెంట్ కు తన ఇన్నింగ్స్ తో చాటి చెప్పాడు.
8/ 8
ఇక భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో వన్డే ఆదివారం (నవంబర్ 27న) జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ ను అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు డీడీ స్పోర్ట్స్ కూడా ప్రత్యక్షప్రసారం చేయనుంది.