IND vs NZ 2nd ODI : టాస్ సమయంలో గజినిలా మారిపోయిన రోహిత్.. బిక్క మొహం వేసిన లేథమ్.. అసలేం జరిగిందంటే?
IND vs NZ 2nd ODI : టాస్ సమయంలో గజినిలా మారిపోయిన రోహిత్.. బిక్క మొహం వేసిన లేథమ్.. అసలేం జరిగిందంటే?
IND vs NZ 2nd ODI : రాయ్ పూర్ వేదికగా జరగనున్న రెండో వన్డేలో గెలిచి సిరీస్ ను పట్టేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఇక అదే సమయంలో ఈ మ్యాచ్ లో నెగ్గి సిరీస్ ను సమం చేయాలని కివీస్ సిద్ధమైంది.
హైదరాబాద్ (Hyderabad) వేదికగా జరిగిన తొలి వన్డే క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచింది. ఆ మ్యాచ్ లో ఏకంగా 688 పరుగలు నమోదయ్యాయి. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో శుబ్ మన్ గిల్ (Shubman Gill) డబుల్ సెంచరీతో అలరించాడు.
2/ 9
కాసేపటికే దానిని తలదన్నేలా కివీస్ బ్యాటర్ బ్రేస్ (BraceWell) వెల్ తన పవర్ హిట్టింగ్ తో భారత బౌలర్లను బెదరగొట్టాడు. ఆఖర్లో ఒత్తిడిని అధిగమించి నెగ్గిన భారత్ సిరీస్ లో ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలో రెండో వన్డేకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి.
3/ 9
రాయ్ పూర్ వేదికగా జరగనున్న రెండో వన్డేలో గెలిచి సిరీస్ ను పట్టేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఇక అదే సమయంలో ఈ మ్యాచ్ లో నెగ్గి సిరీస్ ను సమం చేయాలని కివీస్ సిద్ధమైంది. (PC : TWITTER)
4/ 9
ఇక టాస్ సమయంలో రోహిత్ మతిమరుపుతో నవ్వులు పూయించాడు. రోహిత్ టాస్ ను వేయగా.. లేథమ్ హెడ్స్ చెప్పాడు. అయితే టెయిల్ పడటంతో రోహిత్ టాస్ నెగ్గాడు.
5/ 9
ఇంతవరకు అంతా బాగానే ఉంది. అయితే ఇక్కడే రోహిత్ మతిమరుపుతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. టాస్ నెగ్గిన తర్వాత బ్యాటింగ్ ఎంచుకోవాలో లేక ఫీల్డింగ్ చేయాలా అనే విషయంపై రోహిత్ ఇబ్బంది పడ్డాడు. (PC : TWITTER)
6/ 9
కాసేపటికి గుర్తు తెచ్చుకున్న రోహిత్ ఫీల్డింగ్ అంటూ తన నిర్ణయాన్ని చెప్పాడు. అనంతరం ఈ విషయాన్ని కామెంటేటర్ రవిశాస్త్రి అడగ్గా.. టాస్ గెలిచాక ఏం ఎంచుకోవాలో అన్న విషయాన్ని మర్చిపోయినట్లు రోహిత్ తెలిపాడు. (PC : TWITTER)
7/ 9
డ్రెస్సింగ్ రూంలో టాస్ గెలిస్తే ఏం ఎంచుకోవాలో నిర్ణయించుకున్నామని.. అయితే టాస్ తర్వాత అది బ్యాటింగా.. బౌలింగా అనేది తనకు వెంటనే తట్టలేదని రోహిత్ పేర్కొన్నాడు.
8/ 9
ఇక టాస్ విషయంలో రోహిత్ మతిమరుపును చూసి కివీస్ కెప్టెన్ టామ్ లేథమ్ బిక్క మొహం వేశాడు. అసలు రోహిత్ ఏం చేస్తున్నాడో అర్థం కాక అలానే నిల్చున్నాడు.
9/ 9
పిచ్ పై పచ్చిక ఎక్కువగా ఉండటంతో పాటు రెండో ఇన్నింగ్స్ సమయంలో డ్యూ వచ్చే అవకాశం ఉండటంతో భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు కూడా ఎటువంటి మార్పులు చేయలేదు. తొలి వన్డేలో ఆడిన జట్లతోనే ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి.