‘ధావన్ ఒక మ్యాచ్ విన్నర్. అతడికి వన్డేల్లో అద్భుతమైన రికార్డు ఉంది. అంతేకాకుండా అతడు బిగ్ మ్యాచ్ ప్లేయర్. అయినప్పటికీ ధావన్ కు అనుకున్నంత పేరు రాలేదు. అందుకు కారణం కోహ్లీ, రోహిత్ ల మీదే అందరి దృష్టి ఉండటం. దాంతో ధావన్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లు కూడా తెరమరుగయ్యాయి’ అని రవిశాస్త్రి కామెంట్స్ చేశాడు.