రిషబ్ పంత్‌కు టీ20 ప్రపంచకప్‌లో అవకాశం వచ్చినా బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేయలేకపోయాడు. టి20 ప్రపంచకప్ (T20 World Cup)లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా (Team India).. సెమీఫైనల్లో అవమానకర రీతిలో ఓడి ఇంటి దారి పట్టింది. 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించి టి20 ప్రపంచకప్ ను సాధిస్తుందని ఆశపడ్డ అభిమానులకు మరోసారి నిరాశ తప్పలేదు. ఇక, మెగాటోర్నీ తర్వాత టీ20, వన్డే సిరీస్ కోసం టీమిండియా ఇప్పుడు న్యూజిలాండ్ చేరుకుంది.
టీ20 సిరీస్‌కు పంత్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇక, హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా ఎంపికయ్యాడు. టీ20 ప్రపంచకప్‌లో అట్టర్ ప్లాప్ షో తర్వాత రోహిత్ శర్మను టీ20ల్లో తప్పించి.. అతని స్థానంలో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వాలన్న డిమాండ్లు ఎక్కువ అవుతున్నాయి. ఈ కీలక పరిణామాల మధ్య హార్దిక్ పాండ్యాకు కూడా ఈ సిరీస్ ఎంతో కీలకమైంది. (AP)
ఇక, పంత్ కు ఇది చావో రేవో సిరీస్ లాంటిది. 25 ఏళ్ల పంత్ టీ20 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై 3, ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో 6 పరుగులు చేశాడు. రెండో వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ కూడా విఫలమయ్యాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో కార్తీక్‌కు జట్టులో చోటు దక్కలేదు. వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ తమ స్టామినాను ఇక్కడ చూపించాలనుకుంటున్నారు. వీరిద్దరితోనే పంత్ పోటీ పడాల్సి ఉంది. (AFP)
అయితే ధోని తర్వాత అతడి వారసుడిగా చలామణి అయ్యే అర్హత ఉన్న ప్లేయర్ గా ప్రస్తుతానికి అయితే సంజూ సామ్సన్ మాత్రమే కనిపిస్తున్నాడు. ధోనిలా కూల్ గా ఉండే అతడు ఫినిషర్ గా జట్టుకు అక్కరకు వస్తాడు. ఈ మధ్య జరిగిన సిరీస్ ల్లో పంత్, కిషన్ కంటే కూడా సంజూ సామ్సన్ ఎన్నో రెట్లు మెరుగ్గా ఆడాడు. అయితే పంత్ కు దక్కినట్లు వరుసగా సంజూ సామ్సన్ కు అవకాశాలు దక్కలేదు. అయితే, ఈ సిరీస్ లో రాణిస్తే పంత్ కు చెక్ పెట్టగలడు.