IND vs AUS : హైదరాబాద్ వేదికగా మరో సూపర్ మ్యాచ్.! ఎప్పుడంటే?
IND vs AUS : హైదరాబాద్ వేదికగా మరో సూపర్ మ్యాచ్.! ఎప్పుడంటే?
IND vs AUS : ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు హైదరాబాద్ లోని క్రికెట్ అభిమానులు స్టేడియానికి పోటెత్తిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా హైదరాబాద్ వేదికగా మరోసారి అంతర్జాతీయ మ్యాచ్ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సెప్టెంబర్ ఆఖర్లో హైదరాబాద్ (Hyderabad) వేదికగా భారత్ (India), ఆస్ట్రేలియా (Australia) జట్ల మధ్య సిరీస్ విజేతను తేల్చే మూడో టి20 జరిగిన సంగతి తెలిసిందే. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించి సిరీస్ ను 2-1తో సొంతం చేసుకుంది.
2/ 8
ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు హైదరాబాద్ లోని క్రికెట్ అభిమానులు స్టేడియానికి పోటెత్తిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా హైదరాబాద్ వేదికగా మరోసారి అంతర్జాతీయ మ్యాచ్ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
3/ 8
వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి మధ్యలో భారత్ లో ఆస్ట్రేలియా పర్యటించనుంది. బోర్డర్-గావస్కర్ సిరీస్ లో భాగంగా ఇరు జట్లు నాలుగు టెస్టులను ఆడే అవకాశం ఉంది. ఇందులో ఒకటి డే నైట్ టెస్టుగా జరిగే అవకాశం ఉంది.
4/ 8
ఈ సిరీస్ లో భాగంగా జరిగే ఒక మ్యాచ్ కు హైదరాబాద్ వేదికగా నిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ చివరి సారిగా 2017లో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్ కు ఆతిథ్యమిచ్చింది.
5/ 8
రొటేషన్ పద్దతిలో భాగంగా ఈసారి టెస్టు మ్యాచ్ హైదరాబాద్ వేదికగా జరిగే అవకాశం ఉంది. ఇక ఈ సిరీస్ లో రెండో టెస్టు ఢిల్లీ వేదికగా.. ధర్మశాలలో మూడో టెస్టు జరిగే అవకాశం ఉందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
6/ 8
నాలుగో టెస్టును అహ్మదాబాద్ వేదికగా నిర్వహించే అవకాశం ఉన్నట్లు ఆ అధికారి తెలిపారు. తొలి టెస్టు కోసం హైదరాబాద్, నాగ్ పూర్, చెన్నైలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
7/ 8
ఇక వచ్చే ఏడాది జరిగే వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్స్ కు భారత్ అర్హత సాధించాలంటే ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్ ను 4-0తో క్లీన్ స్వీప్ చేయాల్సి ఉంది.
8/ 8
ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ లో ప్రస్తుతం భారత్ 52.08 శాతంతో నాలుగో స్థానంలో ఉంది. 70 శాతంతో ఆస్ట్రేలియా తొలి స్థానంలో ఉండగా.. 60 శాతంతో సౌతాఫ్రికా రెండో స్థానంలో ఉంది. 53.33 శాతంతో శ్రీలంక మూడో స్థానంలో ఉంది.