IND vs NZ 1st ODI : టీమిండియా ఓటమిని శాసించిన 40వ ఓవర్.. ఆ ఓవర్లో ఏం జరిగిందంటే?
IND vs NZ 1st ODI : టీమిండియా ఓటమిని శాసించిన 40వ ఓవర్.. ఆ ఓవర్లో ఏం జరిగిందంటే?
IND vs NZ 1st ODI : తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (76 బంతుల్లో 80; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శిఖర్ ధావన్ (77 బంతుల్లో 72; 13 ఫోర్లు) క్లాస్ ఇన్నింగ్స్ ఆడారు. శుబ్ మన్ గిల్ (65 బంతుల్లో 50; 1 ఫోర్, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేశాడు.
మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను భారత్ (India) ఓటమితో ఆరంభించింది. న్యూజిలాండ్ (New Zealand)తో జరిగిన తొలి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. దాంతో న్యూజిలాండ్ మూడు మ్యాచ్ ల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
2/ 8
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ (76 బంతుల్లో 80; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), శిఖర్ ధావన్ (77 బంతుల్లో 72; 13 ఫోర్లు) క్లాస్ ఇన్నింగ్స్ ఆడారు. శుబ్ మన్ గిల్ (65 బంతుల్లో 50; 1 ఫోర్, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేశాడు.
3/ 8
చివర్లో వాషింగ్టన్ సుందర్ (16 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రెచ్చిపోవడంతో టీమిండియా భారీ స్కోరును అందుకుంది. ఈ పర్యటనలో తొలి వన్డే ఆడుతున్న సంజూ సామ్సన్ (38 బంతుల్లో 36; 4 ఫోర్లు) రాణించాడు.
4/ 8
అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ ఆరంభంలో తడబడింది. అరంగేట్రం హీరో ఉమ్రాన్ మాలిక్ ఆరంభంలో చెలరేగి బౌలింగ్ చేశాడు. దాంతో కివీస్ 88 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.
5/ 8
అయితే టామ్ లాథమ్ (104 బంతుల్లో 145 నాటౌట్; 19 ఫోర్లు, 5 సిక్సర్లు) టీమిండియా బౌలర్లపై శివతాండవం ఆడాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (98 బంతుల్లో 94 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) భారత్ ను ఓడేలా చేశారు.
6/ 8
వీరిద్దరూ అజేయమైన 4వ వికెట్ కు రికార్డు స్థాయిలో 221 పరుగులు జోడించారు. ఒకరకంగా చెప్పాలంటే వీరి ముందు భారత బౌలర్లు తేలిపోయారు. ఆరంభంలో అదరగొట్టిన ఉమ్రాన్ మాలిక్ కూడా ఆఖర్లో దారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు.
7/ 8
ఇక పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ భారత ఓటమికి అసలు కారణం చెప్పాడు. బ్యాటింగ్ లో తాము మంచి ప్రదర్శన చేసి ప్రత్యర్థి ముందు కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఉంచామన్నాడు. ఇక బౌలింగ్ లో కూడా 39వ వరకు మెరుగ్గా వేశామన్నడు.
8/ 8
అయితే 40వ ఓవర్ మ్యాచ్ కు టర్నింగ్ పాయింట్ గా ధావన్ పేర్కొన్నాడు. ఆ ఓవర్లో లాథమ్ 6, 4, 4, 4, 4 బాదాడు. శార్దుల్ ఠాకూర్ వేసిన ఆ ఓవర్లో కివీస్ ఏకంగా 25 పరుగులు రాబట్టింది. ఈ ఓవర్ తర్వాత మ్యాచ్ కివీస్ వైపు మొగ్గిందని ధావన్ కామెంట్ చేశాడు.