IND vs NZ : తొడగొట్టిన గబ్బర్.. దిగ్గజాల సరసన చేరిక.. ఇలాంటి ప్లేయర్ ను ప్రపంచకప్ కు దూరం పెడతారా?
IND vs NZ : తొడగొట్టిన గబ్బర్.. దిగ్గజాల సరసన చేరిక.. ఇలాంటి ప్లేయర్ ను ప్రపంచకప్ కు దూరం పెడతారా?
IND vs NZ : ఈ వన్డేలో 77 బంతుల్లో 72 పరుగులు చేసిన ధావన్ జట్టుకు భారీ స్కోరు అందించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇందులో 13 ఫోర్లు ఉన్నాయి. శుబ్ మన్ గిల్ తో కలిసి తొలి వికెట్ కు 124 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
న్యూజిలాండ్ (New Zealand)తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా (Team India) తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) అదరగొట్టాడు. చాలా రోజుల తర్వాత టీమిండియా తరఫున ఆడుతున్న అతడు తొలి వన్డేలో వింటేజ్ ధావన్ ను అందరికీ చూపించాడు.
2/ 8
ఈ వన్డేలో 77 బంతుల్లో 72 పరుగులు చేసిన ధావన్ జట్టుకు భారీ స్కోరు అందించడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇందులో 13 ఫోర్లు ఉన్నాయి. శుబ్ మన్ గిల్ తో కలిసి తొలి వికెట్ కు 124 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
3/ 8
ఈ క్రమంలో ధావన్ అరుదైన రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్ లో ధావన్ తన వ్యక్తిగత స్కోరు 43 పరుగులకు చేరుకోగానే లిస్ట్ ‘ఎ’ క్రికెట్ లో ధావన్ 12 వేల మార్కును అందుకున్నాడు.
4/ 8
ఈ మైలురాయిని అందుకున్న ఏడో భారత క్రికెటర్ గా ధావన్ నిలిచాడు. ఇప్పటి వరకు లిస్ట్ ‘ఎ’ క్రికెట్ లో 297 మ్యాచ్ లు చేసిన ధావన్ 12,025 పరుగులు చేశాడు. లిస్ట్ ‘ఎ’ క్రికెట్ లో అంతర్జాతీయ వన్డేలతో పాటు దేశవాళి వన్డేలు కూడా ఉంటాయి.
5/ 8
ఈ జాబితాలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 551 లిస్ట్ ‘ఎ’ మ్యాచ్ ల్లో 21, 999 పరుగులు చేశాడు. రెండో స్థానంలో సౌరవ్ గంగూలీ 437 మ్యాచ్ ల్లో 15,622 పరుగులు చేశాడు.
6/ 8
వీరి తర్వాత రాహుల్ ద్రవిడ్ (51, 271 పరుగులు), విరాట్ కోహ్లీ (13, 786 పరుగులు), ధోని (13, 353) పరుగులు, యువరాజ్ సింగ్ (12,633 పరుగులు) శిఖర్ ధావన్ కంటే ముందున్నారు.
7/ 8
ఇక న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో భారత్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 306 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ తో పాటు శుబ్ మన్ గిల్ (65 బంతుల్లో 50; 1 ఫోర్, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీతో ధావన్ కు సహకరించాడు. శ్రేయస్ అయ్యర్ (76 బంతుల్లో 80; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మంచి ఇన్నింగ్స్ ఆడాడు.
8/ 8
చివర్లో వాషింగ్టన్ సుందర్ (16 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రెచ్చిపోవడంతో టీమిండియా భారీ స్కోరును అందుకుంది. ఈ పర్యటనలో తొలి వన్డే ఆడుతున్న సంజూ సామ్సన్ (38 బంతుల్లో 36; 4 ఫోర్లు) రాణించాడు.