IND vs NZ : సెలెక్టర్ పై కోపంతో కెరీర్ ను నాశనం చేసుకున్న టీమిండియా బ్యాటర్! ఎవరంటే?
IND vs NZ : సెలెక్టర్ పై కోపంతో కెరీర్ ను నాశనం చేసుకున్న టీమిండియా బ్యాటర్! ఎవరంటే?
IND vs NZ 1st ODI : భారత క్రికెట్ జట్టులో ప్రయాణం అంటే అంత సులభంగా ఉండదు. కెరీర్ లో ఒడిదుడుకులు ఎదురైనా సంయమనంతో ముందుకు సాగుతేనే సక్సెస్ అవుతారు. ఆవేశంలో రాంగ్ స్టెప్ వేస్తే కెరీర్ ను నాశనం చేసుకుంటారు. అలా చేసుకున్న ప్లేయర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
భారత జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్న అంబటి రాయుడు 2019 సంవత్సరంలో పతాక శీర్షికల్లో నిలవడం అందరికీ గుర్తుండే ఉంటుంది. టీమ్ ఇండియా తరఫున నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. అంతేకాకుండా చాలా సార్లు జట్టును ఆదుకున్నాడు. -AP
2/ 7
దాంతో 2019 వన్డే ప్రపంచకప్ లో అతడికి టీమిండియాలో చోటు తప్పక ఉంటుందని అంతా భావించారు. నాలుగో స్థానంలో అంబటి రాయుడు 4 అర్ధ సెంచరీలతో పాటు ఒక సెంచరీ చేసి ప్రపంచకప్ రేసులో నిలిచాడు. -AFP
3/ 7
ఫిబ్రవరి 2019లో.. న్యూజిలాండ్ టూర్లో అంబటి రాయుడు అద్బుతంగా రాణించాడు. ఒక మ్యాచ్ లో 90 పరుగులతో రాణించాడు. అయితే ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్ ల్లో విఫలం అయ్యాడు. -AFP
4/ 7
కేవలం 3 మ్యాచ్ ల్లో విఫలం అయ్యాడనే కారణంతో అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అతడిని వన్డే ప్రపంచకప్ కు ఎంపిక చేయలేదు. అతడి స్థానంలో ఆల్ రౌండర్ విజయ్ శంకర్ కు చోటు కల్పించాడు. -AFP
5/ 7
దీనిని జీర్ణించుకోలేకపోయిన అంబటి రాయుడు ఎమ్మెస్కే ప్రసాద్ పై సోషల్ మీడియాలో విమర్శలు కూడా చేశాడు. విజయ్ శంకర్ 3డి ప్లేయర్ (బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్) అని అందుకే అతడిని ప్రపంచకప్ కోసం తీసుకున్నట్లు ప్రసాద్ వివరణ ఇచ్చుకున్నాడు. -AFP
6/ 7
దాంతో మరింతగా ఆగ్రహించిన అంబటి రాయుడు డైరెక్ట్‌గా MSKని టార్గెట్ చేస్తూ 3డి గ్లాసెస్ ఆర్డర్ చేస్తున్నానంటూ ట్వీట్ చేశాడు. 3డి కళ్లద్దాలతో ప్రపంచకప్‌ను ఆస్వాదిస్తా అంటూ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కేపై సెటైర్స్ వేశాడు.-AFP
7/ 7
ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత, అంబటి రాయుడు హఠాత్తుగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే, ఆ తర్వాత అతడు తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. దేశవాళి క్రికెట్ లో ఆడాడే తప్ప టీమిండియాకు మాత్రం ఆడలేకపోయాడు.