మరో నాలుగు రోజుల్లో భారత్-ఇంగ్లండ్ (India vs England) మధ్య ఐదు టెస్ట్‌ల సిరీస్ ప్రారంభంకానుంది. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ 2021-22లో జరిగే ఫస్ట్ సిరీస్ ఇదే కావడంతో ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఉమేశ్ యాదవ్ తమ సతీమణులతో కలిసి సరదాగా గడిపారు. ఫొటో షూట్ కూడా నిర్వహించారు. ఈ ఫోటోలు ఇప్పుడు తెగ వైరలవుతున్నాయ్. (Photo Credit : Instagram)
ఇక, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టైలిష్ బ్యాట్స్ మెన్ కేల్ రాహుల్.. వీరిద్దరూ మంచి స్నేహితులు. అంతేనా.. వీరిద్దరూ ఫోటో షూట్లకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు తమ స్టైలిష్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ల జోడీలు.. బాలీవుడ్ బ్యూటీలు అనుష్క శర్మ, అతియా శెట్టి కూడా ఇంగ్లండ్ అందాల్ని ఆస్వాదిస్తున్నారు. (Photo Credit : Instagram)