ప్రస్తుతం విరాట్ కోహ్లీ (Virat Kohli) పేలవ ఫామ్ తో సతమతమవుతున్నాడు. ఈ పర్యటనలో ఇంగ్లండ్‌తో ఒక టెస్టు.. 2 టీ20లు.. ఒక వన్డే ఆడాడు. కానీ కోహ్లీ బ్యాట్ నుంచి ఒక అర్ధ సెంచరీ కూడా రాలేదు. కేవలం 59 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇప్పుడు భారత జట్టులో అతని స్థానంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చాలా మంది మాజీ క్రికెటర్లు కోహ్లీని జట్టు నుంచి తప్పించాలని మాట్లాడుతున్నారు. వీటన్నింటి మధ్య.. కోహ్లీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను పంచుకున్నాడు. అందులో అతను సానుకూలంగా ఉన్నానని ..త్వరలో రోజులు కూడా మారుతాయని చెప్పడానికి ప్రయత్నించాడు. (Virat Kohli Instagram)
విరాట్ కోహ్లీ వాల్ ఆర్ట్‌ను పంచుకున్నాడు. ప్రేరణాత్మక మెసేజ్ ఉన్న ఓ పెయింటింగ్ ఫోటో వద్ద దిగిన ఫోటోను విరాట్ కోహ్లీ ఈరోజు ట్వీట్ చేశాడు. ఆర్టిస్ట్ వేసిన పక్షి రెక్కల బొమ్మ వద్ద కూర్చున్న ఫోటోను పోస్ట్ చేశాడు. అయితే పేంటింగ్కు ఓ మెసేజ్ కూడా ఉంది. 'వాట్ ఇఫ్ ఐ ఫాల్.. ఓహ్ బట్ మై డార్లింగ్, వాట్ ఇఫ్ యూ ఫ్లయ్' అని పేంటింగ్పై రాసి ఉంది. 'నేను కింద పడితే ఏమౌతుంది.. మై డార్లింగ్ నువ్వు ఎగురుతున్నావ్ కదా' అని దాని అర్ధం. మొత్తానికి తన వస్తున్న విమర్శలకు కోహ్లీ ఇలా బదులిచ్చాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పర్స్పెక్టివ్ అనే క్యాప్షన్‌ను కూడా జత చేశాడు. దీంతో కోహ్లీ తన వైఖరి, ఆలోచన ఎలా ఉందో చెప్పకనే చెప్పాడు. (Virat Kohli Instagram)
ఇంగ్లండ్ టూర్ తర్వాత భారత్ వెస్టిండీస్ వెళ్లాల్సి ఉంది. ఐదు టీ20ల సిరీస్‌తో పాటు 3 వన్డేలు ఆడాల్సి ఉంది. ఈ పర్యటనకు విరాట్ కోహ్లీని ఎంపిక చేయలేదు. టీ20 సిరీస్‌లోనూ అతనికి బోర్డు నుంచి విశ్రాంతి లభించింది. నెల రోజుల పాటు క్రికెట్‌కు పూర్తిగా దూరంగా ఉంటాడని.. ఫ్యామిలీతో కలిసి లండన్‌లో సెలవులు గడపనున్నాడని వార్తలు వస్తున్నాయి. (Virat Kohli Instagram)
భారత మాజీ కెప్టెన్ తన సంధి దశలో క్రికెట్ సోదరుల నుంచి మద్దతు పొందుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండవ ODIలో కోహ్లీ ఔట్ తర్వాత.., పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం విరాట్ కి మద్దతుగా ఒక ట్వీట్ చేసాడు,. అందులో అతను విరాట్‌తో కలిసి ఉన్న చిత్రాన్ని పంచుకున్నాడు. ' ఈ సమయం కూడా గడిచిపోతుంది. ధైర్యంగా ఉండు' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. (AFP)