మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కెన్నింగ్టన్ ఓవల్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. 111 పరుగుల లక్ష్యాన్ని ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మరో 188 బంతులు మిగిలి ఉండగానే ఛేదించారు. రోహిత్ 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. వన్డేల్లో అతనికిది 45వ హాఫ్ సెంచరీ. ఇక, రోహిత్.. ఈ హాఫ్ సెంచరీతో అద్భుత రికార్డును తన సొంతం చేసుకున్నాడు. (Instagram)
ఇంగ్లండ్‌లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన విదేశీ ఆటగాడిగా రోహిత్ శర్మ మొదటి స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్‌పై అజేయంగా 76 పరుగుల తర్వాత.. ఇంగ్లాండ్‌లో 1411 పరుగులకు చేరుకున్నాడు రోహిత్. దీంతో.. కేన్ విలియమ్సన్ (1393)ని అధిగమించాడు. రికీ పాంటింగ్ (1387) ఇంగ్లండ్‌లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడు. విరాట్ కోహ్లీ ఇంగ్లండ్‌లో ఇప్పటి వరకు వన్డేల్లో 1316 పరుగులు చేశాడు. (Instagram)
ఇంగ్లండ్‌లో అత్యధిక వన్డే సెంచరీలు సాధించిన విదేశీ ఆటగాడు కూడా రోహిత్ శర్మనే. ఇంగ్లండ్‌లో ఇప్పటి వరకు 7 సెంచరీలు చేశాడు. అందులో ఐదు సెంచరీలు 2019 ప్రపంచకప్ లో వచ్చినవే. ఇంగ్లండ్‌లో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా జో రూట్ రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు 8 సెంచరీలు చేశాడు. మార్కస్ ట్రెస్కోథిక్ కూడా 8 సెంచరీలు చేశాడు. (Instagram)
కెన్నింగ్టన్ ఓవల్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో తన 250 సిక్సర్లను కూడా పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాటర్ గా నిలిచాడు. 76 పరుగుల ఇన్నింగ్స్‌లో ఐదు సిక్సర్లు బాదాడు. షాహిద్ అఫ్రిది వన్డేల్లో 351 సిక్సర్లు కొట్టాడు. రోహిత్ తర్వాత వన్డేల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ (229). (AP)