భారత్ (India)తో జరిగిన ఐదో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ (England) జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం ముగిసిన ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు 7 వికెట్ల తేడాతో టీమిండియా (Team India)పై విజయఢంకా మోగించింది. ఫలితంగా ఐదు మ్యాచ్ ల సిరీస్ ను 2-2తొ డ్రా అయ్యింది. 378 పరగుల లక్ష్యంతో.. ఓవర్ నైట్ స్కోరు 3 వికెట్లకు 259 పరుగులతో చివరి రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్.. 76.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 378 పరుగులు చేసి గెలుపొందింది. మాజీ కెప్టెన్ కోహ్లీతో భారత ఓటమికి కారణమైన ఐదుగురు ఆటగాళ్లు ఎవరో ఓ లుక్కేద్దాం. (AP)
ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇంగ్లిష్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌటైంది, ఇంగ్లండ్‌కు 378 పరుగుల లక్ష్యాన్ని ధనాధన్ గా అందుకుని చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. మాజీ కెప్టెన్ జో రూట్, ఫామ్‌లో ఉన్న జానీ బెయిర్‌స్టో 269 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. రూట్ 142, జానీ బెయిర్‌స్టో 114 పరుగులతో నాటౌట్‌గా తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. (AP)
మాథ్యూ పాట్స్ తొలి ఇన్నింగ్స్‌లో విరాట్‌ను బౌల్డ్ చేశాడు. 19 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 11 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లోనూ 20 పరుగులకే అవుటయ్యాడు. మ్యాచ్ మొత్తమ్మీద కేవలం 31 పరుగులే చేశాడు. మరో సీనియర్ బ్యాటర్.. కెప్టెన్ రోహిత్ శర్మ లేనప్పుడు బాధ్యతగా ఆడాల్సిన కోహ్లీ.. ఇలా ఔటవ్వడంతో ఫ్యాన్స్ ఎంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. (BCCI ట్విట్టర్)
ఓటమికి కారణమైన క్రికెటర్లలో యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా ఒకడు. తీవ్రమైన పోటీ నేపథ్యంలో ఈ మ్యాచ్ లో అతనికి రెండు అవకాశాలు వచ్చాయ్. కానీ, రెండు అవకాశాల్ని నీటిపాలు చేశాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ గిల్ ఔటైన తీరు అతని కెరీర్ నే ప్రశ్నార్ధకంగా మార్చింది. ఆఫ్ స్టంప్ వెలుపల బంతుల్ని వెంటాడిన గిల్.. రెండు సార్లు స్లిప్స్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ టెస్టులో కేవలం 21 పరుగులు మాత్రమే చేశాడు. (AFP)
భారత పేసర్ మహ్మద్ సిరాజ్ 5వ రోజు బౌలింగ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టినప్పటికీ, అందులో 2 లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ కావడం విశేషం. అతను 11.4 ఓవర్లు బౌలింగ్ చేసి 66 పరుగులు సమర్పించుకున్నాడు. అంటే ప్రతి ఓవర్లో ఎకానమీ రేట్ 6 పరుగులు. ఇక.. రెండో ఇన్నింగ్స్‌లో అతను 6.53 ఎకానమీ రేట్‌తో పరుగులు ఇచ్చాడు. రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్ 15 ఓవర్లలో 98 పరుగులు సమర్పించుకున్నాడు. రెండో ఇన్నింగ్స్ మియా బాయ్ కి ఒక వికెట్ కూడా దక్కలేదు. (AFP)
శ్రేయాస్ అయ్యర్ కూడా తన బ్యాట్‌తో ఆకట్టుకోవడంలో విఫలమయ్యాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం లభించనప్పటికీ.. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అతను మొత్తం 34 పరుగులు (15,19) చేయగలిగాడు. ఇది మాత్రమే కాదు, అతను రెండు ఇన్నింగ్స్‌లలో షార్ట్ పిచ్ బంతికి ఔట్ అయ్యాడు. ఇంగ్లండ్ కోచ్ మెక్ కల్లమ్ పన్నిన ఉచ్చులో చిక్కుకున్నాడు శ్రేయస్. (AFP)
ఈ మ్యాచులో శార్దూల్ ఠాకూర్ బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో చేతులేత్తేశాడు. బ్యాటింగ్ లో అట్టర్ ప్లాప్ అయిన శార్దూల్.. బౌలింగ్ లో కూడా తీవ్రంగా నిరాశపర్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ లో 1 పరుగు మాత్రమే చేసి.. బౌలింగ్ లో ఒక వికెట్ తీసుకున్నాడు. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో 26 బంతుల్లో 4 పరుగులు చేసి.. 11 ఓవర్లలో 65 పరుగులిచ్చి వికెట్ తీయలేకపోయాడు. (AFP)