టెస్ట్ క్రికెట్ లో ప్రస్తుతం జానీ బెయిర్‌స్టో (Johny Bairstow) అద్భుతమైన ఫామ్ కొనసాగుతోంది. భారత్ తో జరుగుతున్న ఐదో టెస్టులో 119 బంతుల్లో 100 పరుగులు చేశాడు. టెస్టులో చివరి 4 ఇన్నింగ్స్‌ల్లో 50కి పైగా పరుగులు చేశాడు. తొలిసారి ఈ ఫీట్ అందుకున్నాడు. ఈ నాలుగు ఇన్నింగ్సుల్లో అతని మొత్తం స్ట్రైక్ రేట్ 100కు పైగానే ఉంది.(AFP)
32 ఏళ్ల బెయిర్‌స్టో అంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 92 బంతుల్లో 136 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆ తర్వాత మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 157 బంతుల్లో 162 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్‌లో 44 బంతుల్లో అజేయంగా 71 పరుగులు చేశాడు. అతని దూకుడు బ్యాటింగ్‌తో ఆ జట్టు 3-0తో సిరీస్‌ని క్లీన్‌స్వీప్ చేసింది. (AFP)