యువ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav)ను జట్టులోకి తీసుకొని బ్యాటింగ్ డెప్త్ పెంచాలన్నాడు. నలుగురు బౌలర్లు, ఆరుగురు బ్యాట్స్‌మన్ వ్యూహంతో బరిలో దిగితే మిగతా రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధిస్తుందని తెలిపాడు. ఆరో బ్యాట్స్‌మన్‌గా హనుమ విహారికి బదులు సూర్యకుమార్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకుంటే బ్యాటింగ్ లైనప్ బలంగా తయారవుతుందని సూచించాడు. నాలుగో టెస్టుకు అతడిని తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు.
మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో కోహ్లీ (Virat Kohli) నుంచి సిరాజ్ (Mohammed Siraj) వరకు కేవలం 54 నిమిషాల్లో పెవీలియన్ చేరిపోయారంటే భారత జట్టు ఎంత దారుణంగా బ్యాటింగ్ చేసిందో అర్దం చేసుకోవచ్చు. లీడ్స్ టెస్టు ఓటమితో ఐదు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమంగా మారింది. మూడున్నర రోజుల్లోనే ముగిసిన ఈ టెస్ట్‌లో కోహ్లీసేన చెత్త బ్యాటింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. సెప్టెంబర్ 2 నుంచి ఓవల్‌లో నాలుగో టెస్టు జరుగుతుంది.
మరోవైపు, మిగతా రెండు టెస్టుల్లో రొటేషన్ పాలసీ గురించి ఆలోచిస్తామని కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఈ మాటలను బట్టి నాలుగో టెస్ట్ లో టీమిండియాలో సమూల మార్పులు ఉంటాయని హింట్ ఇచ్చాడు. దీంతో నాలుగో టెస్ట్ లో ఎవరిపై వేటు పడనుందో అర్ధం కావటం లేదు. కేఎల్ రాహుల్ ను వికెట్ కీపర్ గా తీసుకుని.. పృథ్వీషా తో ఓపెనింగ్ చేయించే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఇక, నాలుగో టెస్ట్ లో అశ్విన్ ను కచ్చితంగా తుది జట్టులో చూడొచ్చు. ఎందుకంటే టీమిండియాపై వీరవీహారం చేస్తోన్న జో రూట్ ను కట్టడి చేయాలంటే అశ్విన్ తుది జట్టులో ఉండటం తప్పనిసరి అని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. అతనితో పాటు శార్దూల్ ఠాకూర్, పృథ్వీషా, సూర్య కుమార్ యాదవ్ లకు జట్టులో చోటు దక్కే ఛాన్సులు ఉన్నాయని క్రీడా నిపుణులు విశ్లేషిస్తున్నారు.