లార్డ్స్ గ్రాండ్ విక్టరీ తర్వాత మరో సూపర్ ఫైట్ కు టీమిండియా (Team India) రెడీ అయింది. ఐదు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా బుధవారం నుంచి లీడ్స్ వేదికగా జరిగే మూడో టెస్ట్ లో ఇంగ్లండ్ (England) ని ఢీ కొట్టడానికి సిద్ధమైంది కోహ్లీసేన. లార్డ్స్ విక్టరీ ఐదు మ్యాచ్ ల సిరీస్ లో 1-0 తో ఆధిక్యంలో వెళ్లిన భారత్.. అదే జోరును కొనసాగించి సిరీస్‌పై మరింత పట్టు సాధించాలనుకుంటుంది. మరోవైపు అనవసర తప్పిదాలతో విజయం ముంగిట బోల్తా పడిన జోరూట్ సేన.. మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తోంది. ఇప్పటికే తమ తప్పిదాలను సరిదిద్దుకునే పనిలో పడిన ఆతిథ్య జట్టు.. తుది జట్టులో మార్పులు చేసేందుకు కూడా సిద్దమవుతోంది. లీడ్స్‌లో లెక్కసరి చేసి లార్డ్స్ ఓటమికి బదులు తీర్చుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలో మూడో టెస్ట్ సైతం అభిమానులకు కావాల్సిన మాజా అందించనుంది. ఇక విజయ ఉత్సాహంలో ఉన్న భారత జట్టులో కూడా స్వల్ప మార్పులు చోటు చేసుకునే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో లీడ్స్ లో ఇంగ్లండ్ తో అమీతుమీ తేల్చుకునే భారత తుది జట్టుపై ఓ లుక్కేద్దాం.
ఇక, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటికే రెండు టెస్ట్ ల్లో 244 పరుగులు చేశాడు ఈ కర్ణాటక యంగ్ బ్యాట్స్ మన్. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ తర్వాత అత్యధిక పరుగులు చేసింది కేఎల్ రాహులే. దీంతో ఈ స్టైలిష్ బ్యాట్స్ మన్ మరోసారి టీమిండియాకి మంచి శుభారంభాన్ని అందిస్తే తిరుగుండదు.
ఈ మధ్య కాలంలో ఫామ్ లేక నానా తంటాలు పడుతున్న ఛతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara)కి మరో అవకాశం ఇవ్వొచ్చు. లార్డ్స్ రెండో ఇన్నింగ్స్ లో తనదైన శైలిలో జిడ్డు బ్యాటింగ్ తో టీమిండియా ఇన్నింగ్స్ ని నిలబెట్టాడు ఈ నయా వాల్. గత కొద్ది ఇన్నింగ్స్ హాఫ్ సెంచరీ కూడా చేయని పుజారా.. ఈ మ్యాచ్ లో రాణిస్తేనే తర్వాత టెస్ట్ కి అందుబాటులో ఉంటాడు. లేకపోతే అతనిపై వేటు పడే ఛాన్స్ ఉంది.
విరాట్ కోహ్లీ.. (Virat Kohli) టీమిండియా కెప్టెన్ టెస్ట్ ల్లో సెంచరీ చేసి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఈ సిరీస్ లో కూడా అనుకున్నంతగా కోహ్లీ రాణించింది లేదు. కేవలం మూడు ఇన్నింగ్స్ లో 62 రన్స్ మాత్రమే చేశాడు. అయితే, తనదైన రోజు ప్రత్యర్ధులకు సవాల్ విసరగలిగే కోహ్లీ.. టచ్ లోకి వస్తే ఇంగ్లండ్ కు చుక్కలు ఖాయం. కోహ్లీ ఫ్యాన్స్ కూడా ఓ మంచి ఇన్నింగ్స్ అతని బ్యాట్ నుంచి ఆశిస్తున్నారు.
పుజారా లాగే.. టీమిండియా మిడిలార్డర్ కు భారంగా మారాడు అజింక్య రహానే (Ajinkya Rahane). అయితే, లార్డ్స్ సెకండ్ ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. దీంతో అతనికి మరో అవకాశం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు విరాట్ కోహ్లీ. ఓపెనింగ్ స్ట్రాంగ్ ఉన్నా.. మిడిలార్డర్ వైఫల్యంతో టీమిండియా బాధ పడుతోంది. దీంతో ఈ టెస్ట్ లో విరాట్ కోహ్లీ, పుజారా తో పాటు రహానే కూడా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మరోవైపు మ్యాచ్ జరిగే లీడ్స్ ఎండలు బాగా కాసే ఉంది. దీంతో పొడి వాతావరణం స్పిన్నర్లకు సహకరిస్తోంది. దీంతో జడేజా బదులు అశ్విన్ కు చోటు దక్కే అవకాశం ఉంది. లేకపోతే మరోసారి అశ్విన్ కు నిరాశే ఎదురు కానుంది. స్పిన్నర్ల విషయం మినహా.. లీడ్స్ టెస్ట్ మ్యాచుకు భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు.