తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్లకు 338 పరుగులు చేసింది. 111 బంతుల్లో 146 పరుగులు చేసి పంత్ ఔటయ్యాడు. 19 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. అదే సమయంలో రవీంద్ర జడేజా 163 బంతుల్లో 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరిద్దరూ 222 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక, పంత్ తన విరోచిత బ్యాటింగ్ తో రికార్డుల దుమ్ముదులిపాడు. (AFP)