Team India : రోహిత్, కోహ్లీ, రాహుల్ కు అంత సీన్ లేదంట.. ప్రస్తుతం అతడే నంబర్ వన్ అంటూ మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్
Team India : రోహిత్, కోహ్లీ, రాహుల్ కు అంత సీన్ లేదంట.. ప్రస్తుతం అతడే నంబర్ వన్ అంటూ మాజీ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్
Team India : కరోనా వల్ల ఈ మ్యాచ్ కు రోహిత్ శర్మ దూరం కాగా.. అతడి స్థానంలో జస్ ప్రీత్ బుమ్రా తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భారత్ ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉంది.
శుక్రవారం నుంచి భారత్ (India), ఇంగ్లండ్ (England) జట్ల మధ్య ఐదో టెస్టు మ్యాచ్ ఆరంభమైన సంగతి తెలిసిందే. రిషభ్ పంత్ (146), రవీంద్ర జడేజా (83 బ్యాటింగ్) వీరోచిత పోరాటంతో భారత్ తొలి రోజు ఆటను గౌరవప్రదమైన స్కోరుతో ముగించింది.
2/ 6
ఈ మ్యాచ్ లో స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ (11), చతేశ్వర్ పుజారా (13) మరోసారి చేతులెత్తేసిన సంగతి తెలిసిందే. 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియాను రిషభ్ పంత్, జడేజా ఆదుకున్నారు. వీరు ఆరో వికెట్ కు 222 పరుగులు జోడించారు.
3/ 6
భారత మాజీ టెస్టు ప్లేయర్ వసీం జాఫర్ భారత టెస్టు జట్టుపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం టీమిండియా టెస్టు జట్టులో నంబర్ వన్ ప్లేయర్ ఎవరో వసీం జాఫర్ చెప్పే ప్రయత్నం చేశాడు.
4/ 6
’టీమిండయా తరఫున టెస్టుల్లో ప్రస్తుతం రిషభ్ పంత్ నంబర్ వన్ బ్యాటర్‘ అని జాఫర్ పేర్కొన్నాడు. అంతేకాకుండా పీకల్లోతు కష్టాల్లో ఉన్న టీమిండియాను జడేజాతో కలిసి పంత్ ఆదుకున్న తీరును జాఫర్ ప్రశంసించాడు.
5/ 6
ఈ మ్యాచ్ లో గనుక టీమిండియా గెలిస్తే తొలి ఇన్నింగ్స్ లో పంత్ ఆడిన ఇన్నింగ్స్ అతడి కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ గా నిలిచిపోతుందని జాఫర్ పేర్కొన్నాడు. ఇక భారత్ తొలి రోజు ఆటలో 7 వికెట్లకు 338 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
6/ 6
కరోనా వల్ల ఈ మ్యాచ్ కు రోహిత్ శర్మ దూరం కాగా.. అతడి స్థానంలో జస్ ప్రీత్ బుమ్రా తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భారత్ ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉంది.