IND VS ENG 5TH TEST LIVE SCORES TEAM INDIA BOWLER JASPRIT BUMRAH HITS 4 4WD 6NB 4 4 4 6 1 IN STUART BROAD BOWLING SJN
IND vs ENG : అప్పుడు యువరాజ్.. ఇప్పుడు బుమ్రా.. పాపం బ్రాడ్ మళ్లీ బలైయ్యాడుగా..
IND vs ENG Test Match : ఈ క్రమంలో రవీంద్ర జడేజా (194 బంతుల్లో 104; 13 ఫోర్లు) శతకం పూర్తి చేశాడు. సెంచరీ బాదిన కాసేపటికే జడేజా పెవిలియన్ కు చేరుకోవడం విశేషం. అనంతరం క్రీజులోకి వచ్చిన తాత్కాలిక సారథి జస్ ప్రీత్ బుమ్రా (16 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టి20 తరహాలో రెచ్చిపోయాడు.
ఇంగ్లండ్ (England)తో ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరుగుతోన్న ఐదో టెస్టులో భారత (India) జట్టు భారీ స్కోరును సాధించింది. ఓవర్ నైట్ స్కోరు 7 వికెట్లకు 338 పరుగులతో భారత్ రెండో రోజు ఆటను కొనసాగించింది.
2/ 6
ఈ క్రమంలో రవీంద్ర జడేజా (194 బంతుల్లో 104; 13 ఫోర్లు) శతకం పూర్తి చేశాడు. సెంచరీ బాదిన కాసేపటికే జడేజా పెవిలియన్ కు చేరుకోవడం విశేషం. అనంతరం క్రీజులోకి వచ్చిన తాత్కాలిక సారథి జస్ ప్రీత్ బుమ్రా (16 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టి20 తరహాలో రెచ్చిపోయాడు. (PC : BCCI)
3/ 6
ఇంగ్లండ్ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఇన్నిగ్స్ 85వ ఓవర్లో స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న బుమ్రా విశ్వరూపం ప్రదర్శించాడు. 2007లో జరిగిన టి20 ప్రపంచకప్ లో యువరాజ్ ఏ రీతిన బ్రాడ్ పై చెలరేగిపోయాడో దాదాపుగా అదే రీతిలో బుమ్రా బూమ్ బూమ్ షాట్లతో అదరగొట్టాడు.
4/ 6
4, 4 (వైడ్), 6 (నోబాల్), 4, 4, 4, 6, 1 కొట్టి 35వ ఓవర్ లో ఏకంగా 35 పరుగులు పిండుకున్నాడు. బుమ్రా దెబ్బకు బ్రాడ్ మొహం వాడిపోయినా పైకి మాత్రం నవ్వుతూ కనిపించాడు.
5/ 6
ఇక తొలి ఇన్నింగ్స్ లో భారత్ 84.5 ఓవర్లలో 416 పరుగులకు ఆలౌటైంది. 98 పరుగులకే 5 వికెట్లు నష్టపోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ భారత్ ను జడేజా, పంత్ సెంచరీలతో ఆదుకున్నారు. ఫలితంగా భారత్ భారీ స్కోరును సాధించగలిగింది.
6/ 6
ఇక ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ 5 వికెట్లతో రెచ్చిపోగా.. పాట్స్ 2 వికెట్లు తీశాడు. బ్రాడ్, బెన్ స్టోక్స్, రూట్ లకు తలా ఒక వికెట్ లభించింది. ఈ సిరీస్ లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ను డ్రాగా ముగించినా సరే భారత్ సిరీస్ ను సొంతం చేసుకుంటుంది.