తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు సాధించడంతో పాటు ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసి భారీ ఆధిక్యాన్ని అందుకుంది టీమిండియా. ఇక రెండో ఇన్నింగ్స్ లో తొలి ఇన్నింగ్స్ లో మాదిరి ఆడలేకపోయింది. పుజారా, రిషభ్ పంత్ అర్ధ సెంచరీల పుణ్యమా అని 245 పరుగులు చేసింది. దాంతో ప్రత్యర్థి ముందు భారత్ 378 పరుగుల భారీ టార్గెట్ ను ఉంచగలిగింది.
అయితే జానీ బెయిర్ స్టో (72 బ్యాటింగ్), జో రూట్ (76 బ్యాటింగ్) భారత్ ను చితకొట్టారు. బౌలర్ ఎవరైనా సరే తాము వన్డే తరహా బ్యాటింగ్ చేస్తామంటూ పరుగులు రాబట్టారు. ఇక బెయిర్ స్టో 14 పరుగుల వద్ద ఇచ్చిన క్యాచ్ ను హనుమ విహారీ నేలపాలు చేశాడు. ఒకవేళ ఆ క్యాచ్ పట్టి ఉంటే భారత్ పరిస్థితి ఇంకోలా ఉండేదేమో. (PC : TWITTER)
బెయిర్ స్టో, రూట్ అజేయమైన నాలుగో వికెట్ కు 150 పరుగులు జోడించారు. ఇంగ్లండ్ విజయం సాధించాలంటే చివరి రోజు ఆటలో కేవలం 119 పరుగులు చేస్తే చాలు. 90 ఓవర్లలో 119 పరుగులు కొట్టడం పెద్ద కష్టమేమి కాదు కదా.. అందులోనూ చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఇందులో భారత్ ఓడిపోవడం ఖాయం. (PC : TWITTER)