IND VS ENG 5TH TEST LIVE SCORES AFTER KAPIL DEV MS DHONI AND HARBHAJAN SINGH RAVINDRA JADEJA BECOME 4TH INDIAN TO SCORE TWO CENTURIES IN A SINGLE CALENDAR YEAR SJN
Ravindra Jadeja : అదీ జడేజా అంటే.. ఆ విషయంలో ఏకంగా కపిల్ దేవ్, ధోనీల సరసనే చేరాడుగా..
Ravindra Jadeja : తాజాగా ఇంగ్లండ్ తో జరుగుతోన్న చివరిదైన ఐదో టెస్టులో ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన రవీంద్ర జడేజా.. సెంచరీ (104)తో కదం తొక్కాడు. రిషభ్ పంత్ (146)తో కలిసి ఆరో వికెట్ కు 222 పరుగులు జోడించి భారత్ ను పటిష్ట స్థితిలో నిలిపాడు.
రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. కెరీర్ ఆరంభంలో కేవలం బౌలర్ గానే రాణించిన జడేజా.. ఇప్పుడు బ్యాటర్ గానూ అదరగొడుతున్నాడు. చివర్లో బ్యాటింగ్ కు వచ్చి కీలక ఇన్నింగ్స్ లతో మెరుస్తున్నాడు.
2/ 6
తాజాగా ఇంగ్లండ్ తో జరుగుతోన్న చివరిదైన ఐదో టెస్టులో ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన రవీంద్ర జడేజా.. సెంచరీ (104)తో కదం తొక్కాడు. రిషభ్ పంత్ (146)తో కలిసి ఆరో వికెట్ కు 222 పరుగులు జోడించి భారత్ ను పటిష్ట స్థితిలో నిలిపాడు.
3/ 6
ఓవర్ నైట్ స్కోరు 83 పరుగులతో బ్యాటింగ్ కు దిగిన జడేజా.. తొలి సెషన్ లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అనంతరం 104 పరుగుల వద్ద అవుటై పెవిలియన్ కు చేరాడు.
4/ 6
ఈ క్రమంలో టెస్టుల్లో ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి ఒకే క్యాలెండర్ ఇయర్లో రెండు సెంచరీలు సాధించిన నాలుగో భారత ఆటగాడిగా జడేజా రికార్డులకెక్కాడు.
5/ 6
గతంలో భారత్ తరఫున టెస్టుల్లో ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి మొత్తం ముగ్గురు బ్యాటర్లు ఒకే క్యాలెండర్ ఇయర్ లో రెండు సెంచరీలు చేశారు. వారిలో టీమిండియా మాజీ కెప్టెన్లు కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనిలు ఉండటం విశేషం.
6/ 6
1986లో కపిల్ దేవ్.. 2009లో మహేంద్ర సింగ్ ధోన.. 2010లో హర్భజన్ సింగ్ లు ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి రెండు సెంచరీలు చేశారు. తాజాగా ఎడ్జ్ బాస్టన్ టెస్టు మ్యాచ్ ద్వారా వీరి సరసన స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా చేరాడు. (PC : RCB)