ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో విరాట్ కోహ్లి ఇప్పటి వరకు హాఫ్ సెంచరీ చేయలేదు. ఇక, ఆదివారం మాంచెస్టర్ వేదికగా భారత్-ఇంగ్లండ్ (IND vs ENG) మధ్య మూడో వన్డే మ్యాచ్ జరగనుంది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు జట్లు ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తున్నాయి. (AFP)
ఇంగ్లండ్‌తో జరిగిన 5వ టెస్టు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కోహ్లీ వరుసగా 11, 20 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత టీ20 సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో అతనికి విశ్రాంతి లభించింది. చివరి 2 మ్యాచ్‌ల్లో అతను 1 మరియు 11 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ తర్వాత తొలి వన్డేలో గాయం కారణంగా ఆడలేకపోయాడు. రెండో వన్డేలో 16 పరుగులు చేసి ఔటయ్యాడు. (AFP)
అంటే కోహ్లీ.. ఒక మ్యాచులో 25 పరుగులు కూడా దాటలేకపోయాడు. ఇంగ్లండ్ పర్యటన అనంతరం 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు భారత జట్టు వెస్టిండీస్‌కు వెళ్లాల్సి ఉంది. రెండు జట్లలోనూ కోహ్లిని ఎంపికచేయలేదు. విశ్రాంతి పేరుతో అతన్ని పక్కన పెట్టారు. ఈ సమయంలో కోహ్లీకి దాదాపు ఒక నెల విరామం లభిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో చివరి మ్యాచ్‌లోనైనా కోహ్లీ జోరు చూపించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. (AP)
రోహిత్ శర్మ సారథ్యంలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇప్పుడు వన్డే సిరీస్‌ను కూడా గెలవాలనుకుంటుంది. సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కానీ రెండో మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లిష్ జట్టు అద్భుతంగా పునరాగమనం చేసింది. (AP)