ఇక, ఇంగ్లండ్ పర్యటనలో పదే పదే ఒకే బౌలర్ చేతికి చిక్కి పెవీలియన్ చేరుతున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో విరాట్ తడబడటం చూశాం. టెస్ట్ కెరీర్ లో అండర్సన్ బౌలింగ్ మొత్తం 590 బంతులాడిన కోహ్లీ.. 247 పరుగులు చేశాడు. కెరీర్ లో మొత్తం 7 సార్లు విరాట్ కోహ్లీ.. అతని బౌలింగ్ లో ఔటయ్యాడు. ఈ గణంకాలు చాలు.. విరాట్ కోహ్లీ ఎంతగా అండర్సన్ బౌలింగ్ లో ఇబ్బంది పడుతున్నాడో అర్ధం చేసుకోవడానికి. (News18 Gfx)
జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదుకునే విషయంలో కోహ్లీకి మంచి రికార్డు ఉన్నది. ఎన్నో సార్లు ఒంటి చేత్తే ఇన్నింగ్స్‌లను చక్కదిద్దాడు. కానీ మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 7 పరుగులకే అవుటయ్యాడు. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ ప్రదర్శన అత్యంత పేలవంగా ఉన్నది. తొలి టెస్టులో డకౌట్ అయిన కోహ్లీ, రెండో టెస్టులో 42, 20 పరుగులు చేశాడు. కోహ్లీ అంతర్జాతీయ ఫార్మాట్లో సెంచరీ చేయక ఇప్పటికి 641 రోజులు అవుతోంది. చివరి సెంచరీ చేసిన తర్వాత కోహ్లీ సగటు కేవలం 23.00 మాత్రమే.
అంతే కాకుండా అన్ని ఫార్మాట్లు కలిపి 50 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ చేసింది మూడు అర్దసెంచరీలు మాత్రమే. పరుగుల యంత్రం అని పేరు తెచ్చుకున్న కోహ్లీ వైఫల్యాలు భారత జట్టుకు కూడా భారంగా మారుతున్నాయి. కీలక సమయంలో వికెట్ పారేసుకోవడం అభిమానులను చికాకు పెడుతున్నది. రాబోయే టీ20 వరల్డ్ కప్ ముందు కోహ్లీ ఇలాంటి పేలవ ఫామ్‌లో ఉండటం జట్టుకు మంచిది కాదని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.