ఐపీఎల్ హోస్ట్ అంటే అందరికి మొదటగా గుర్తొచ్చే పేరు గ్లామ్ డాల్ మయంతి లాంగర్ (Mayanti Langer). ఆమె కోసం మ్యాచ్‌లు చూసేవారు కూడా ఉన్నారు. ఆకట్టుకునే రూపంతో, తనదైన శైలిలో క్రికెట్ వ్యాఖ్యానం చేసే ఈ బ్యూటీ వ్యాఖ్యాతగా క్రేజీ పాపులారిటీ సంపాదించుకుంది. ప్రీ , పోస్ట్ మ్యాచ్ షోలో తనదైన యాంకరింగ్‌తో ఓ రివల్యూషన్ తీసుకొచ్చింది.మైదానంలో మైక్ పట్టుకొని సీనియర్ క్రికెటర్లతో ఆమె చేసే హడావుడి అంత ఇంతకాదు. అయితే, లేటెస్ట్ గా ఆమె చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
లీడ్స్‌లోని హెడింగ్లేలో జరిగిన 3వ టెస్టులో (3rd Test) ఇంగ్లాండ్ (England) చేతితో భారత జట్టు (Team India)ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే, టీమిండియా మేటి బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీతో పాటు మిడిలార్డర్ ను షేక్ చేశాడు ఇంగ్లండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ (James Anderson).
టీమిండియా తరుపున 6 టెస్టులు ఆడిన స్టువర్ట్ బిన్నీ, ఓ హాఫ్ సెంచరీతో 194 పరుగులు చేశాడు. మూడు వికెట్లు పడగొట్టాడు.. వన్డే క్రికెట్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు కలిగిన బౌలర్ కూడా స్టువర్ట్ బిన్నీయే. 2014లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చిన స్టువర్ట్ బిన్నీ, ఆరు వికెట్లు పడగొట్టి, అనిల్ కుంబ్లేని రికార్డును బ్రేక్ చేసి, టీమిండియా తరుపున బెస్ట్ గణాంకాలు నమోదుచేశాడు.