ఇంగ్లండ్ పర్యటన(India vs England)లో రెండో టెస్ట్ కోసం టీమిండియా (Team India) రెడీ అవుతోంది. ఫస్ట్ టెస్ట్ లో గెలిచి.. విజయంతో సిరీస్ ను ప్రారంభించాలనుకున్న టీమిండియాకు ఆశలకు వరుణుడు బ్రేకులు వేసిన సంగతి తెలిసిందే.మొదటి టెస్ట్ చివరి రోజు వర్షంతో తుడిచిపెట్టుకపోయింది. దీంతో తొలి టెస్టు డ్రాగా ముగిసింది. భారత్ విజయం దాదాపు ఖాయం అయినా.. ఆ క్రెడిట్ వరణుడి ఖాతాలోకి వెళ్లింది.
మ్యాచ్ ఫీజుతో పాటు ఇరు జట్ల ప్రపంచ టెస్ట్ చాంపియన్షిప్ (WTC) పాయింట్లలో కూడా కోత విధించాడు మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్. మ్యాచ్ డ్రా కావడంతో కొత్త డబ్ల్యూటీసీ రూల్స్ ప్రకారం భారత్, ఇంగ్లండ్ జట్లకు చెరో నాలుగు పాయింట్స్ వచ్చాయి. అయితే స్లో ఓవర్-రేట్ కారణంగా ఇరు జట్లలో చెరో రెండు పాయింట్లను జరిమానాగా విధించారు.