Team India : ఈ వెటరన్ ప్లేయర్ కు గుడ్ బై చెప్పాల్సిన టైమ్ వచ్చేసింది.. ఒకప్పుడు మ్యాచ్ విన్నరే అయినా ఇప్పుడు మాత్రం
Team India : ఈ వెటరన్ ప్లేయర్ కు గుడ్ బై చెప్పాల్సిన టైమ్ వచ్చేసింది.. ఒకప్పుడు మ్యాచ్ విన్నరే అయినా ఇప్పుడు మాత్రం
Team India : న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో ఓడిన తర్వాత.. బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్ లోనూ భారత్ చిత్తయ్యింది. తన కంటే బలహీనమైన బంగ్లాదేశ్ పై వరుసగా తొలి రెండు మ్యాచ్ ల్లోనూ ఓడి సిరీస్ ను కోల్పోయింది. చివరి వన్డేలో నెగ్గి వైట్ వాష్ ను తప్పించుకుంది.
గత కొన్ని రోజులుగా టీమిండియా (Team India) ఆటతీరు ఏ మాత్రం బాగోలేదు. ముఖ్యంగా వన్డేల్లో చెత్త ఆటతీరును ప్రదర్శిస్తుంది. టి20 ప్రపంచకప్ తర్వాత ఆడిన రెండు వన్డే సిరీస్ ల్లోనూ దారుణంగా ఓడింది.
2/ 8
న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో ఓడిన తర్వాత.. బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్ లోనూ భారత్ చిత్తయ్యింది. తన కంటే బలహీనమైన బంగ్లాదేశ్ పై వరుసగా తొలి రెండు మ్యాచ్ ల్లోనూ ఓడి సిరీస్ ను కోల్పోయింది. చివరి వన్డేలో నెగ్గి వైట్ వాష్ ను తప్పించుకుంది.
3/ 8
ఇక ఈ సిరీస్ లో శిఖర్ ధావన్ దారుణంగా విఫలం అయ్యాడు. ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచాడు. ఒక్క మ్యాచ్ లో కూడా పట్టుమని 10 పరుగుల చేయలేకపోయాడు.
4/ 8
తొలి వన్డేలో 7 పరుగులు చేసిన ధావన్.. రెండో వన్డేలో 8.. మూడో వన్డేలో 3 పరుగులు మాత్రమే చేశాడు. ఓవరాల్ గా మూడు వన్డేల్లోనూ కలిసి 18 పరుగులు చేశాడు.
5/ 8
ఇక న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో 72 పరుగుల చేసిన ధావన్.. ఆ తర్వాత జరిగిన రెండు వన్డేల్లోనూ వరుసగా 3, 28 పరుగులు చేశాడు. ప్రస్తుతం ధావన్ జట్టుకు భారంగా మారాడనేది వాస్తవం.
6/ 8
శిఖర్ ధావన్ మ్యాచ్ విన్నర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ప్రస్తుతం మాత్రం ధావన్ తన స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించలేకపోతున్నాడు.
7/ 8
గాయం కారణంగా రోహిత్ శర్మ మూడో వన్డేకు దూరం కాగా.. అతడి స్థానంలో వచ్చిన ఇషాన్ కిషన్ ఏకంగా డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఈ క్రమంలో తర్వాతి సిరీస్ లకు ధావన్ ను తొలగించి ఇషాన్ కిషన్ ను ఓపెనర్ గా ఆడించాలనే అభిమానులు కోరుకుంటున్నారు.
8/ 8
ఈ క్రమంలో శిఖర్ ధావన్ క్రికెట్ కెరీర్ కు ఫుల్ స్టాప్ పడినట్లుగానే అంతా భావిస్తున్నారు. భవిష్యత్తులో టీమిండియా ఆడే వన్డే సిరీస్ లకు ధావన్ పేరును సెలెక్టర్లు పరిశీలించకపోయే అవకాశం ఉంది.