IND vs BAN : మైండ్ గేమ్స్ లో నువ్వు తోపు సామీ.. బంగ్లాకు ఇచ్చి పడేసిన టీమిండియా వెటరన్
IND vs BAN : మైండ్ గేమ్స్ లో నువ్వు తోపు సామీ.. బంగ్లాకు ఇచ్చి పడేసిన టీమిండియా వెటరన్
IND vs BAN : 145 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 45 పరుగులు చేసింది. నాలుగో రోజు ఆటలో వెంట వెంటనే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
బంగ్లాదేశ్ (Bangladesh)తో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను భారత్ (India) వైట్ వాష్ చేసింది. తొలి టెస్టులో 188 పరుగుల భారీ తేడాతో నెగ్గిన టీమిండియా (Team India).. రెండో టెస్టులో విజయం కోసం చెమటోడ్చాల్సి వచ్చింది.
2/ 8
145 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 45 పరుగులు చేసింది. నాలుగో రోజు ఆటలో వెంట వెంటనే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
3/ 8
ఒక దశలో భారత్ 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమికి చేరువగా కనిపించింది. మెదీ హసన్ వేసే స్పిన్ బంతులకు భారత బ్యాటర్ల దగ్గర సమాధానామే లేకపోయింది. అయితే ఈ దశలో క్రీజులోకి వచ్చిన వెటరన్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుత పోరాటాన్ని చూపించాడు.
4/ 8
మొదట్లో నెమ్మదిగా ఆడిన అతడు ఆ తర్వాత బంగ్లాదేశ్ ఆత్మవిశ్వాసాన్ని సన్నగిల్లేలా చేశాడు. ఈ క్రమంలో రవిచంద్రన్ అశ్విన్ బంగ్లాదేశ్ బౌలర్లతో మైండ్ గేమ్స్ ఆడాడు.
5/ 8
మూడో రోజు ఆటలో బంగ్లా బ్యాటర్లు టైమ్ వేస్ట్ చేస్తూ భారత్ ను అసహనానికి గురి చేసిన సంగతి తెలిసిందే. అచ్చం అలానే అశ్విన్ కూడా బంగ్లాదేశ్ సహనాన్ని పరీక్షించాడు.
6/ 8
పలుమార్లు తాను రెడీగా లేనంటూ బ్యాటింగ్ నుంచి తప్పుకుంటూ బౌలర్లను అసహనానికి గురి చేశాడు. అదే సమయంలో సైడ్ స్క్రీన్ దగ్గర కూర్చున్న పలువురు బంగ్లాదేశ్ అభిమానులు సరిగ్గా బౌలింగ్ చేసే సమయంలో కదులుతూ భారత బ్యాటర్ల ఏకాగ్రతను దెబ్బ తీసేలా చేశారు.
7/ 8
అయితే వీటిని ఓపిగ్గా ఎదుర్కొన్న శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ భారత్ కు అద్భుత విజయాన్ని అందించారు. మెదీ హసన్ వేసిన బౌలింగ్ లో 6, 2, 4, 4 కొట్టిన అశ్విన్ భారత్ కు విక్టరీని అందించాడు.
8/ 8
ఈ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యచ్ గా రవిచంద్రన్ అశ్విన్ నిలవడం విశేషం. ఈ మ్యాచ్ లో 6 వికెట్లతో పాటు రెండో ఇన్నింగ్స్ లో 42 పరుగులతో అజేయంగా నిలిచాడు.