బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా( Team India) తొలి ఇన్నింగ్స్లో 86.3 ఓవర్లలో 314 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఇక, తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 80 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. అయితే, కష్టాల్లో ఉన్న టీమిండియాను పంత్ (Rishabh Pant), శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఆదుకున్న సంగతి తెలిసిందే.
టెస్ట్ సిరీస్ కు ముందు ప్రెస్ మీట్లో రాహుల్ చేసిన వ్యాఖ్యలు కూడా అతనిపై ట్రోలింగ్ కు కారణమవుతున్నాయి. ఇటీవలి కాలంలో టెస్టు క్రికెట్లో ఇంగ్లండ్ అద్భుతంగా ఆడుతుందన్న అతను.. తాము కూడా టెస్టుల్లో ఎగ్రెసివ్ క్రికెట్ ఆడతామని మాటిచ్చాడు. కానీ రిషబ్ పంత్ తప్ప మిగతావాళ్లలో ఆ దూకుడు అసలు ఏ మాత్రం కనిపించడం లేదు.