దాదాపుగా 125 అంతర్జాతీయ మ్యాచ్ లు (మూడు ఫార్మాట్లు కలుపుకుని) ఆడేశాడు. పంత్ కు దక్కినట్లు వేరే ప్లేయర్ కు అవకాశాలు దక్కి ఉంటే ఈపాటికి అతడు స్టార్ ప్లేయర్ లా ఎదిగేవాడు. నాలుగేళ్లకు పైగా అంతర్జాతీయ అనుభవం ఉన్నా ఇప్పటికీ ఎప్పుడు ఏ షాట్ ఆడాలో తెలియని ప్లేయర్ గా పంత్ ఉన్నాడు. ఒక టెస్టుల్లో మినహా పరిమిత ఓవర్ల క్రికెట్ లో పంత్ సక్సెస్ అయిన దాఖలాలు కనిపించవు.
అయితే, పంత్ ఫామ్ లోకి రావాలంటే ఒకటే దారి ఉంది. ఏం లేదు.. జస్ట్ సూర్యకుమార్ యాదవ్ ని ఫాలో అయితే సరిపోతుంది. టీ20ల్లో టీమిండియా తరఫున కీలక బ్యాటర్‌గా మారిన సూర్యకుమార్ యాదవ్ టెస్ట్ క్రికెట్ ఆడాలని భావిస్తున్నాడు. ఇప్పటికే ఆ దిశగా సంకేతాలిచ్చిన సూర్య.. లాంగ్ ఫార్మాట్లో ఆడేందుకు తనను తాను సిద్ధం చేసుకోవడం కోసం కీలక నిర్ణయం తీసుకున్నాడు.
అయితే, ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రిషబ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. ఒక మ్యాచ్‌లో 10 పరుగులు, రెండో మ్యాచ్‌లో 15 పరుగులు మాత్రమే చేశాడు. కివీస్ టూర్ మొత్తం ఫ్లాప్ అవ్వడంతో చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినా బంగ్లాదేశ్ పర్యటనకు జట్టులో స్థానం దక్కించుకున్నాడు. అయితే, పంత్ ని వన్డే సిరీస్ నుంచి తప్పించింది బీసీసీఐ. టెస్ట్ సిరీస్ కు అందుబాటులో ఉంటాడని తెలిపింది.