దీంతో.. బీసీసీఐ ఇప్పుడు కావాలనే పంత్ ను పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. పొమ్మనలేక పొగబెట్టినట్టు తెలుస్తుంది. ఫాంలో లేని రిషబ్ పంత్ ను పక్కన పెడితే.. ఆరు బౌలింగ్ ఆప్షన్లతో టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. అలాగే, ఫాంలో ఉన్న శ్రేయస్ అయ్యర్ ని కూడా పక్కన పెట్టాల్సిన అవసరముండదని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.