తనకు దక్కిన ప్రతి అవకాశాన్ని పంత్ చేజేతులా నాశనం చేసుకుంటున్నాడు. ఇంగ్లండ్ తో జరిగిన మూడో వన్డేలో శతకం (125 నాటౌట్) తర్వాత అతడు గొప్పగా ఆడిన ఇన్నింగ్స్ లేదు. అయినప్పటికీ అతడు జట్టుతోనే ఉంటున్నాడు. వీరు వెంటనే గాడిన పడకపోతే వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ లో చోటు కోల్పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.