ఇక, న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా(Team India) ఇప్పుడు మరో పర్యటనకు రెడీ అయింది. బంగ్లాదేశ్ టూర్ (India Tour Of Bangladesh) కి సిద్ధమైంది. ఆదివారం జరిగే తొలి వన్డేతో భారత్.. బంగ్లాదేశ్ పర్యటనను మొదలుపెట్టనుంది. మూడు వన్డేల సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఢాకాలోని షేర్ ఈ బంగ్లా నేషనల్ స్టేడియం వేదికగా జరగనున్నాయి.
టీ20 ప్రపంచకప్ అనంతరం విశ్రాంతి తీసుకున్న షమీ.. ట్రైనింగ్‌లో గాయపడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే.. జస్ప్రీత్ బుమ్రా గాయంతో దూరమయ్యాడు. వన్డేల్లో షమీ సేవలు కోల్పోయినా టీమిండియాకు వచ్చే పెద్ద నష్టం ఏం లేదు కానీ.. టెస్ట్‌ల్లో ఇబ్బందులు తప్పేలా లేవు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే టీమిండియాఈ రెండు టెస్ట్‌లను గెలవాలి.
ఇక, తొలి వన్డే ఆదివారం జరగనుండగా.. రెండో వన్డే డిసెంబర్ 7న, మూడో వన్డే డిసెంబర్ 10న జరగనుంది. మూడు వన్డే మ్యాచ్‌లు భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 14-18 వరకు చట్టోగ్రమ్ వేదికగా తొలి టెస్ట్, డిసెంబర్ 22-26 వరకు ఢాకా వేదికగా రెండో టెస్ట్ జరగనుంది. రెండు టెస్ట్‌లు 9.30కు ప్రారంభం కానున్నాయి.