టి20 ప్రపంచకప్ (T20 World Cup)లో అంచనాలను అందుకోలేకపోయిన టీమిండియా (Team India)ను అటు అభిమానులు ఇటు మాజీ ప్లేయర్లు విమర్శిస్తూనే ఉన్నారు. టీమిండియా ప్రపంచకప్ లో చేతులెత్తేయడానికి తమకు తోచిన కారణాలను చెబుతూనే ఉన్నారు.
2/ 8
మాజీ ప్లేయర్ల కంటే కూడా అభిమానులు చెప్పే కారణాలు సమంజసంగా ఉంటున్నాయి. ముఖ్యంగా టీమిండియా సెలెక్షన్ పై వారు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.
3/ 8
కొందరు ప్లేయర్లు జట్టులో ఎందుకు ఉంటున్నారో కూడా తమకు అర్థం కావడం లేదని టీమిండియా అభిమానులు వాపోతున్నారు. ఇక టి20 ప్రపంచకప్ తర్వాత భారత్ కివీస్ లో పర్యటిస్తుంది.
4/ 8
న్యూజిలాండ్ తో జరిగే పర్యటన నుంచి సీనియర్లు రోహిత్ శర్మ, కోహ్లీ, రాహుల్, షమీలకు విశ్రాంతి కల్పించిన సంగతి తెలిసిందే. కివీస్ పర్యటన అనంతరం భారత్ బంగ్లాదేశ్ లో పర్యటించనుంది.
5/ 8
బంగ్లాదేశ్ పర్యటనలో భారత్ మూడు వన్డేలతో పాటు రెండు టెస్టు మ్యాచ్ లను ఆడనుంది. ఈ పర్యటన డిసెంబర్ 4 నుంచి ఆరంభం కానుంది. కివీస్ పర్యటనలో ఆఖరి వన్డే నవంబర్ 30న జరగనుంది.
6/ 8
బంగ్లాదేశ్ పర్యటనలో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు కోహ్లీ, షమీ, రాహుల్ దాదాపు టీమిండియా తన పూర్తి బలంతో బరిలోకి దిగనుంది. అయితే బంగ్లాదేశ్ పర్యటన కొందరు ప్లేయర్లకు చావోరేవో లాంటిదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
7/ 8
గత కొంత కాలంగా రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ లు అనుకున్న స్థాయిలో ఆడటం లేదు. చిన్న జట్లపై రాహుల్ రాణిస్తున్నా పెద్ద జట్లపై అందులోనే కీలక పోరుల్లో చేతులెత్తేస్తున్నాడు. వచ్చే ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ కోసం భారత్ ఇప్పటి నుంచే టీం కూర్పుపై దృష్టి పెట్టింది.
8/ 8
రాహుల్ తో పాటు వరుసగా విఫలం అవుతున్న రిషభ్ పంత్, అక్షర్ పటేల్, మొహమ్మద్ షమీలకు బంగ్లాదేశ్ పర్యటన చాలా కీలకం. ఇందులో వీరు నిరాశ పరిస్తే మాత్రం జట్టుకు దూరం కావాల్సిందే.