ఈ మ్యాచులో బంగ్లాదేశ్ బౌలర్లను ఉతికారేశాడు. అలా ఇలా.. కాదు.. చితక్కొట్టేశాడు. ఫాస్ట్ బౌలింగ్ అయినా.. స్పీన్ అయినా.. బౌలర్ ఎవరు వచ్చినా సరే... బంతులు మాత్రం గాల్లోనే కనిపించాయి. నేరుగా బౌండరీ అవతల పడ్డాయి. అంతలా శివతాండవం చేశాడు ఇషాన్ కిషన్. కేవలం 131 బంతుల్లోనే 210 పరుగులు చేశాడు. ఏకంగా 10 సిక్స్‌లు.. 24 ఫోర్లతో.. వీరవిహారం చేశాడు.
మరోవైపు, శిఖర్ ధావన్‌కు శుభ్‌మన్ గిల్ కూడా పెద్ద సవాల్ విసిరాడు. గిల్‌కి ఈ సిరీస్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో చేరే అవకాశం రాలేదు. కానీ ఈ ఏడాది వెస్టిండీస్ మరియు జింబాబ్వే పర్యటనలో వన్డే సిరీస్‌లో అతను ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచాడు. దీంతో.. యంగ్ గన్స్ శిఖర్ ధావన్ కు పెద్ద తలనొప్పిగా మారారు. (AP)